గతంలో పేపర్లో, టీవీలో ఇంటర్వ్యూలలో మాత్రమే సినీ స్టార్స్ గురించి తెలిసేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా సినీరంగ ప్రముఖులందరికీ వేదికగా మారడంతో ఫ్యాన్స్ కు హీరోలు టచ్ లో ఉంటున్నారు.

ఒక్క హీరోలు మాత్రమే కాదండోయ్.. వారి భార్యలు కూడా సోషల్ మీడియాలో చలాకీగా అన్ని విషయాలను షేర్ చేస్తున్నారు. తమ కుటుంబ విషయాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. షేర్ చేసుకుంటున్నారు.

అలా షేర్ చేస్తున్న టాలీవుడ్ తారలలో అగ్ర స్ధానంలో వున్న కధానాయిక నమ్రతా శిరోద్కర్. ఈమె తన భర్త ప్రిన్స్ మహేష్, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి విదేశాలకు టూర్ వెళ్లిన ఫోటోలతోపాటు సితార చేసే పనులను కూడా వీడియో తీసి షేర్ చేసింది.

నమ్రతకు ఏమాత్రం తీసిపోకుండా తన పిల్లల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తుంది రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడిపోయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ రేణూను సొంత మనిషిలా అభిమానిస్తుంటారు.

ఇక మన మగధీర రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా లోకి అప్పుడప్పుడూ వస్తుంటాడు. అయితే అతని సతీమణి ఉపాసన మాత్రం ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా వుంటూ.. చెర్రీతో సరదాగా గడిపిన ఆనంద క్షణాలను షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ లిస్ట్ లోకి అజయ్ భార్య శ్వేత కూడా వచ్చి చేరారు. కొంతకాలంగా తన వర్కవుట్ ఫోటోలు – ఫోటోషూట్లు పెట్టి చాలామందికి ఫిట్నెస్ టిప్స్ చెబుతూ తనకంటూ ఓ ట్రెండ్ ను క్రియేట్ చేసుకుంది. ఈ మధ్యనే ఈమె మిసెస్ ఇండియా ఫైనల్ రౌండ్ వరకు వెళ్లడంతో స్టార్ హోదాను కూడా సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి.

ఈవిధంగా స్టార్ హీరోలతో సమానంగా తమ స్టామినా ను నిరూపించుకుంటున్న మరికొంతమంది తారల వివరాలు..

నాగ చైతన్య భార్య సమంతకు కోటి 3 లక్షలకు పైగా ఇన్ స్టా ఫాలోయర్స్..

నాని భార్య అంజనాకు 1 లక్ష 11 వేల మంది ఫాలోయర్స్..

నాగార్జున భార్య అమలకు ఇన్ స్టాలో 1.75 లక్షల మంది ఫాలోయర్స్ వున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here