భార్యకి విడాకులు ఇచ్చి.. ప్రేయసితో పెళ్ళికి రెడీ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్

0
268

భార్యకి విడాకులు ఇచ్చి.. ప్రేయసితో పెళ్ళికి రెడీ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్

బాలీవుడ్‌లో పెళ్లి చేసుకోవడం విడిపోవడం చాలా సహజం. ఇంతకూ ముందు కూడా మనం ఇలాంటి వ్యవహారాలు చాలానే చూసాం. ప్రస్తుతం మరో జంట అదేబాటలో పయనిస్తుంది..

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు హిమేశ్ రష్మియా దంపతులు తమ 22 ఏళ్ళ వైవాహిక బంధానికి టాటా బై బై చెప్పారు. 1995 లో హిమేశ్, కోమల్ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ స్వయం అనే కుమారుడు కూడా ఉన్నాడు.

గత కొద్దికాలంగా ఇద్దరిమధ్య వ్యక్తిగత విభేదాల కారణంగా ఒకరికొకరు దూరంగా ఉంటున్న వీరికి బుధవారం కోర్టు విడాకులు మంజూరు చేసింది. కుమారుడి సంరక్షణ బాధ్యతలను ఇద్దరు కలిసి చూసుకోవాలని ముంబైలోని బంద్రా ఫ్యామిలీ కోర్టు సూచించింది.

హిమేష్ రష్మియా దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్దికాలంగా మీడియాలో వస్తున్న వార్తలకు దీంతో తెరపడింది. అయితే హిమేష్ రష్మియా టెలివిజన్ తార సోనం కపూర్ తో సంబంధం పెట్టుకొన్నాడనే వార్తలు జోరుగా ప్రచారం కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here