నల్లని పెదాలు ఎర్రగా మారాలంటే పాటించాల్సిన చిట్కాలివే..!

0
65

చాలామంది అమ్మాయిలు ఎంతో అందంగా కనిపించాలనే తపనతో మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. వారి మొహానికి ఎంత మేకప్ వేసినా లిప్స్ రంగు లేకపోతే అందవిహీనంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల లిప్స్టిక్ , లిప్ బాంబులను వాడుతూ ఉంటారు. అలాంటివి వాడినప్పుడు కేవలం కొంతవరకు మాత్రమే మన పెదాలు ఎరుపుగా ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తాయి. అయితే మార్కెట్లో లభ్యమయ్యే ప్రొడక్ట్స్ లో వివిధ రకాల రసాయనాలను కలపడం వల్ల కొన్నిసార్లు అవి ప్రమాదకరంగా కూడా మారవచ్చు అలాంటప్పుడు మన ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన వాటితో మన పెదాలను ఎర్రగా ఎంతో అందంగా ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

మన పెదాలు డ్రైగా మారినప్పుడు మన ఇంట్లో లభ్యమయ్యే బటర్, కొబ్బరి నూనె, వంటివాటిని మన పెదవులకు రోజు అప్లై చేయడం ద్వారా మన పెదవులు ఎంతో మృదువుగా మారుతాయి. అంతేకాకుండా మన ఇళ్లలో సహజంగా లభ్యమయ్యే అలోవెరా జెల్ ను రోజుకు రెండుసార్లు అప్లై చేయడం ద్వారా మన పెదవులు ఎంతో సాఫ్ట్గా మారిపోతాయి.

డ్రై గా మారిన , పగిలిన పెదవులకు విటమిన్ ఈ టాబ్లెట్స్ మంచి రెమిడీ గా ఉపయోగపడతాయి. ఈ విటమిన్ క్యాప్సూల్స్ మనకు మార్కెట్లో ఎంతో విరివిగా లభిస్తాయి.ఈ క్యాప్సిల్స్ ను బ్రేక్ చేసి అందులో ఉన్న మెడిసిన్ మన పెదాలపై అంటించడం ద్వారా ఎంతో మృదువుగా తయారవడంమే కాకుండా పింక్ కలర్ లోకి మారుతాయి.

ఎర్రటి పెదాలు లను కోరుకునేవారు ఎక్కువగా దానిమ్మ, బీట్ రూట్, క్యారెట్ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎర్రటి పెదాలు పొందవచ్చు. బీట్ రూట్ జ్యూస్ లోకి కొద్దిగా నిమ్మరసం చక్కెర కలిపిన మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేయడం ద్వారా ఎర్రటి పెదాలను మీ సొంతం చేసుకోవచ్చు. లిప్స్ కి ఎర్రటి కలర్ ను తీసుకురావడంలో ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో భాగంగానే స్ట్రాబెర్రీస్ తీసుకొని బాగా స్మాష్ చేసి అందులో కొద్దిగా పెట్రోలియం జెల్లీ మిక్స్ చేసి మన పెదాలకు అప్లై చేయడం ద్వారా రూబీ రెడ్ పెదాలను పొందవచ్చు. ఇలాంటి కొన్ని సహజమైన చిట్కాలను పాటించడం ద్వారా అందమైన, మృదువైన ఎర్రటి లిప్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here