రామ్ నటించిన దేవదాసు చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియాన. ఆనతి కాలంలో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు టాప్ స్టార్స్ అందరితోనూ నటించింది. ఇలియానా తన నడుము అందాలతో యావత్ తెలుగు కుర్రకూరును తన వైపు తిప్పుకుంది ఈ గోవా బ్యూటీ.. దేవదాసు సినిమా అందించిన విజయంతో మహేష్ సరసన పోకిరి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక పోకిరి తెలుగు లో భారీ హిట్ అందుకోవడంతో ఇక ఇల్లి బేబీకి వరుస సినిమాలు క్యూ కట్టాయి. కొద్దికాలంలోనే దాదాపు తెలుగులో ఉన్న కుర్రహీరోలు అందరితో నటించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఒక ఊపు ఊపింది. అయితే తెలుగులో తన కెరీర్ మంచి ఊపుమీద ఉన్న సమయంలో హిందీ సినిమాలపై కన్నేసింది ఇల్లీ బేబీ. అక్కడ కూడా “బార్ఫీ” వంటి సినిమాలతో అదరగొట్టింది. ఆ తరువాత వరుసగా నాలుగైదు సినిమాలు చేసింది. అవన్నీ హిట్లు అందుకోవడంతో తెలుగు సినిమాలు మానేసింది. ఆ హిట్లు అందుకున్న తరువాత కూడా బాలీవుడ్ లో సినిమాల అవకాశాలు తగ్గడంతో మళ్ళీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వైపు చూసింది. ఆ మధ్యలో రవితేజ సరసన “అమర్ అక్బర్ అంథోని” సినిమాతో రి-ఎంట్రీ ఇచ్చింది.

పాపం రి-ఎంట్రీ తరువాత ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. “అమర్ అక్బర్ అంథోని” అట్టర్ ప్లాప్ అవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. అయితే తాజగా ఇలియానా యాంకర్ గా తన సత్తా చాలనుకుంటుంది. అది కూడా బుల్లితెర మీద కాదు. ఒక స్పోర్ట్స్ ఛానల్ లో యాంకర్ గా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆ స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యంతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఆ ఛానల్ యాజమాన్యం కూడా ఆమె ప్రపోజల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంకేముంది ఇల్లి బేబీని అందరు త్వరలో స్పోర్ట్స్ యాంకర్ గా చూడబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here