నిరుద్యోగులకు ఐఓసీఎల్ శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగాలు..?

0
142

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 493 ఉద్యోగాల భర్తీ కోసం ఐఓసీఎల్ దరఖాస్తులను కోరుతోంది. సౌత్ ఇండియాలోని ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ఐఓసీఎల్ ఈ ఉద్యోగా లను భర్తీ చేస్తోంది. 493 అప్రెంటీస్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌-ఫ్రెష‌ర్, అకౌంటెంట్, ఐటీఐ చదివిన వాళ్లు, స్కిల్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఓసీఎల్ అభ్యర్థులకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 12, 2020 సంవత్సరం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సర్టిఫికెట్ ను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ మొత్తంలో వేతనం లభిస్తుంది. మార్కెటింగ్ డివిజ‌న్ స‌ద‌ర‌న్ రీజియ‌న్ లో జరుగుతున్న ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం ఖాళీలు ఉండటంతో ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేయడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది.

అయితే అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు పొందే ప్రయోజనాలను మాత్రం పొందలేరు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు, కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచి భవిష్యత్తును పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here