సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎక్కడో పుడతారు, ఎక్కడో కలుస్తారు, వారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆపై తల్లిదండ్రులతో ఒప్పించడం లేకపోతే వారే పెళ్లి చేసుకోవడం ఇలాంటి సన్నివేశాలు చాలా జరిగే చూస్తూ ఉంటారు. అయితే ఇవి కేవలం సినిమాల్లోనే కాకుండా సినిమాల్లో నటించిన వారికి కూడా జరిగాయి అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.

ఇక అసలు విషయానికి వస్తే… ఇలాంటి సంఘటనే మనకు నటుడు డాక్టర్ రాజశేఖర్ తన భార్య జీవితాల మధ్య కూడా జరిగింది. ఇక వీరిద్దరి పరిచయం కూడా ఒక ద్వేష పూరిత సన్నివేశంలో మొదలైందని చెప్పవచ్చు. అది ఎలా జరిగిందంటే నటుడు డాక్టర్ రాజశేఖర్ ని ఒక సినిమా కోసం తమిళ డైరెక్టర్ బుక్ చేసుకున్నాడు. అంతవరకు బాగున్నా సినిమా మొదలయ్యే సమయంలో ఆ సినిమాలో నటి జీవిత అని తెలుసుకున్న తర్వాత హీరోయిన్ గా తను బాగా లేదని ఆ సినిమా నిర్మాతలకు చెప్పాడు డాక్టర్ రాజశేఖర్. దీనితో జీవితను మార్చి ఇంకో హీరోయిని పెట్టమని చెప్పాడు.

ఇక అంతే ఆ మరుసటి రోజు ఆ సినిమా నుంచి డాక్టర్ రాజశేఖర్ ని తీసేసి మరో హీరోని పెట్టి సినిమా తీసి విడుదల చేశారు. ఇక ఇది ఇంతటితో ముగిసిపోయింది అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మరొక సినిమా తలంబ్రాలు అనే సినిమాలో వీళ్లిద్దరు మరి కలిసి నటించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వారిద్దరూ తప్పక మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలో జీవిత మాట్లాడిన తీరు రాజశేఖర్ కు బాగా నచ్చింది. దీంతో ఆమెతో బాగా మాట్లాడుతూ సన్నిహితంగా ఉండటం ద్వారా వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. కాకపోతే ఆ విషయాన్ని వారు ఎవరు చెప్పుకోలేదు.

అయితే కొద్దిరోజుల తర్వాత మళ్ళీ ఆహుతి సినిమాలో రాజశేఖర్ మళ్లీ జీవిత తో కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో రాజశేఖర్ కి పెద్ద అ యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో జీవిత హీరో రాజశేఖర్ దగ్గర ఉంటూ ఆయనకు చాలా సేవ చేసింది. ఈ విషయంలో జీవిత రాజశేఖర్ వాళ్ల తల్లిదండ్రులకు చాలా బాగా నచ్చింది. ఇక ఇలా కొనసాగుతుండగా కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్ జీవిత విషయాన్ని ఇంట్లో ప్రస్తావించి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆయన కుటుంబం నుంచి ఎటువంటి అభ్యంతరం తెలియ చేయకపోవడంతో, అటువైపు నటి జీవిత కూడా రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంతో వారి పెళ్లి సుఖాంతంగా జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. పెద్ద కుమార్తె ఇటీవల దొరసాని సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here