గాలి చొరబడని ప్రదేశమంటూ వుండదు. అలాగే సమస్యల్లేని జీవితం కూడా వుండదు. జీవితంలో ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు, అవమానాలు.. ఆర్ధిక ఇబ్బందులెదురైనప్పుడు ఆ సమస్యల తీవ్రతను బట్టి మనలో చాలామంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటాము. ఇక ప్రస్తుతాంశంలోకి వస్తే బాలీవుడ్ ధోనీగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుశాంత్ మరణం బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ అందర్నీ కలచివేసింది. సుశాంత్ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిన తర్వాతే బలవాన్మరణం పొందడంతో ఇప్పుడు ఈ డిప్రెషన్ బారిన పడిన సినీ ప్రముఖులంతా తమ మనోభావాలను మీడియా ముందుకొచ్చి చెప్పుకుంటున్నారు.

తాజాగా అందిన సమాచారం ఏమిటంటే.. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడని మీడియా కోడై కూస్తుంది. కరణ్ జోహార్ కారణంగానే సుశాంత్ మరణించాడని, బాలీవుడ్‌లో నటనంటే ఏమిటో తెలియనివాళ్ళను తీసుకొచ్చి స్టార్స్‌గా నిలబెట్టే ప్రయత్నం కరణ్ జోహార్ చేశారని.. అందువల్లనే మల్టీ టాలెంటెడ్ పర్సన్ సుశాంత్ లాంటి బ్యాగ్రౌండ్ లేని హీరోలు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు వదలల్సిన దుస్ధితి వస్తుందని కరణ్ జోహర్ పై సుశాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తత్ఫలితంగా బాలీవుడ్ ప్రెజరంతా కరణ్ పై పడుతుండటంతో తాజాగా కరణ్ తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు అంతా అస్తవ్యస్తంగా వున్నాయని ఒక్కమాటలో చెప్పాలంటే కరణ్ డిప్రెషన్ లో వున్నారని బాలీవుడ్ ప్రముఖులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్‌లోనూ కూడా బాలీవుడ్ ప్రముఖులలో ఏ ఒక్కరూ కరణ్ జోహార్ కు అండగా నిలబడకపోవటం ఆశ్చర్యకరమైన విషయం. ఆయన గురించి మాట్లాడటం లేదు.

ఒక్కసారిగా ఊహించని పరిణామాలు ఎదురయ్యేసరికి కరణ్ కూడా చాలా హర్ట్ అయ్యాడని, అందుకే సోషల్ మీడియాలోని తన ఖాతాలలో ప్రముఖులందర్నీ అన్ ఫాలో చేసేయ్యడమే కాకుండా అసలు బయటికి కూడా రావడం లేదని.. ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ చెప్పుకోదగిన ట్విస్ట్ ఏమిటంటే.. సుశాంత్ మరణం తర్వాతనే బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే MAMI ఫిల్మ్ డెవలప్‌మెంట్‌లో కీలకమైన పదవికి కూడా రాజీనామా చేసేసాడు కరణ్ జోహార్. చదివారుగా.. డిప్రెషన్ వలన కలిగే ఇబ్బందులేమిటో.. కాబట్టి మీరూ జీవితంలో ఎన్ళి సమస్యలెదురైనా డిప్రెషన్ బారిన పడకుండా జాగ్రత్త పడండి. ఇక కరణ్ సంగతంటారా.. భవిష్యత్తులో కరణ్ జోహార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడో వేచి చూడాల్సిందే..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here