లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు టాక్ షోలతో బిజీ బిజీ గా లాక్ డౌన్ పిరియడ్ ను గడిపేస్తున్నాడు. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లైవ్ విత్ సునీల్ ఛెత్రి టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తన కెరియర్ మొదటిలో రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపిక అవడంకోసం తన తండ్రిని కొందరు సెలక్టర్లు లంచం అడిగినట్టు తెలిపాడు. అయితే తన లాయర్ గా మారడానికి చాలా కష్టపడడ్డారని, అదే విధంగా తాను కూడా కష్టపడ్డానని తెలిపాడు.

ఈ నేపథ్యంలో సునీల్ ఛెత్రి అడిగిన చాలా ప్రశ్నలకు ఈ షోలో సమాధానమిచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలో ఒకసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాడిల్ స్కూఫ్ను దొంగలించాలని అనుకున్నట్టుగా చెప్పాడు కోహ్లీ. కాగా, చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలో వకార్ యూనిస్, షేన్ వార్న్ వీరిద్దరిలో ఎవరిని బౌలింగ్ లో ఆడాలని అనుకుంటావు అని అడిగిన ప్రశ్నకు వాకర్ యూనిస్ బౌలింగ్ అయితే కొట్టగలనని నమ్మకం ఉందని చెప్పాడు. ఇంతేకాదు ఇదే షో లో మరికొన్ని తన చిన్ననాటి విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here