బీజేపీ యువ నాయకురాలు, ప్రముఖ సినీ నటి మాధవీలత KCR పై సంచలన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. సచివాలయం కూల్చివేతకు KCR అనారోగ్యానికి లింక్ పెడుతూ ఈసారి మాధవీ లత తన ఫేస్ బుక్‌లో ఓ షాకింగ్ పోస్ట్ ను వీడియో రూపంలో షేర్ చేసింది. ఉస్మానియా హాస్పిటల్ లో వర్షం నీరు రావడంతో అక్కడ రోగులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లుగా ఈ వీడియోలో చూసిన చాలా మంది..

“KCR గారూ!! ఈ దుస్థితి చూసిన తర్వాతైనా తెలంగాణ ప్రజలకు అత్యవసరంగా కావాల్సింది సచివాలయమా? లేక వైద్యాలయమా? ఒకప్రక్క జనం పిట్టల్లా రాలి పోతుంటే.. మరోవైపు పాలకులేమో వాటి మీద దృష్టి పెట్టకుండా ఆధునిక నిర్మాణాలపైనా దృష్టి సారిస్తారా? అంటూ తీవ్రంగా మండి పడుతున్నారు. కోర్టు స్టే వరకూ వెళ్లిన ఈ అంశంపై “నిజాం కాలం నాటి గుప్త నిధుల కోసమే సచివాలయాన్ని కూల్చి వేస్తున్నారంటూ గతంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నిజాం నవాబులు ఆరోజుల్లో తమ గుప్త నిధులను 5 రహస్య స్థావరాల్లో దాచి వుంచారని వాటిలో మింట్ కాంపౌండ్, హోం సైన్స్ కాలేజీ, సెక్రటరేట్ జీ బ్లాక్ ఉన్నాయని.. జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నట్లు దాదాపు అన్ని ఆంగ్ల పత్రికలు రాసుకొచ్చాయంటూ.. ఇప్పుడు ఆ గుప్త నిధుల కోసమే KCR పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్. దాంతో సచివాలయం కూల్చివేత అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. హైకోర్ట్‌లో స్టేల వరకూ వెళ్లింది. “ఒక ప్రక్క తెలంగాణ ప్రజలంతా కరోనా మహమ్మారి దెబ్బకి విలవిల్లాడిపోతుంటే.. ఇంత అర్జంట్ గా సచివాలయాన్ని కూల్చేసి..

కొత్తది కట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది..? అని నిలదీయగా దీనికి అధికార పార్టీ నేతలు చెప్పే సమాధానం ఏమిటంటే.. పాత సచివాలయం వాస్తు బాలేదు కాబట్టి కొత్తది కట్టాలి అని.. సరే వాళ్ళు చెప్పింది బాగుంది. అలానే అనుకుందాం.. మరి గడిచిన 7సంవత్సరాలూ KCR పాలించింది ఆ సచివాలయం నుంచే కదా.. అప్పుడేమైంది ఈ వాస్తు సమస్య.? అప్పుడు రాని సమస్య ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటి.? ఎందుకంటే పీఠం మార్చే ఉద్దేశం ఉంది కాబట్టి, తన కుమారుడు KTR జాతకానికి పాత సచివాలయం అంత అనువైనది కాదు కాబట్టి. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. అందులో చాలా మంది ఈ సచివాలయం నుంచే పాలించారు. కానీ, ఏ ముఖ్యమంత్రి కొడుకూ ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. Y.s జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన రాష్ట్రం వేరు. ఇప్పుడు ఇదే మూఢ నమ్మకంతో CM KCR సచివాలయాన్ని కూల్చేందుకు సిద్దమైనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతాంశానికొస్తే.. ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ని వీడియో రూపంలో షేర్ చేసిన నటి మాధవీలత సచివాలయం అంశంపై స్పందిస్తూ..

“సెక్రెటరేట్ వాస్తు ప్రభావం వల్ల.. ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. అందుకే కొత్త బిల్డింగ్ ప్లాన్. మరి పేషెంట్స్ ఉండే హాస్పటల్స్ ఇలా ఉండొచ్చా.? అలాగైతే ఈ వాస్తులో నీటి దోషం ఉంది.. అయినా పర్లేదా.?” అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ చదివిన చాలామంది నెటిజన్లు ‘నీలాంటి మూర్ఖులు పెట్టే అవివేకపు పోస్టింగ్స్‌తో బీజేపీకి మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ.. ఒకళ్ళను అనే ముందు మీ బీజేపీ పార్టీ దేశాన్ని ఎలా పాలిస్తున్నారో తెలుసుకో.. ఏది పడితే అది మాట్లాడే ముందు కేసీఆర్ ఏం చేస్తానన్నారో తెలుసుకో.. కేసీఆర్ ఉస్మానియా హాస్పటల్‌ ప్లేస్‌లో కొత్త బిల్డింగ్ కడతా అన్నారు. కాని మీ పార్టీవాళ్లు కోర్టుకి వెళ్లి అడ్డుకున్నారు అది కూడా తెలియకుండా నువ్ కామెంట్స్ చేస్తున్నావ్.. మీ కళ్ళు బైర్లు కమ్మేలా మీ లీడర్లు ఉస్మానియా మీద చేసిన దొంగ రాజకీయాలను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాము. దమ్ముంటే వాటిని నీ ఫేస్ బుక్ లో షేర్ చేయ్’ అంటూ నటి మాధవీ లతపై ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు TRS కార్యకర్తలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here