మదురై మఠాధిపతి అరుణగిరినాధర్‌ ఇకలేరు!

0
147

ప్రసిద్ధి శైవ మఠం మఠాధిపతి అరుణగిరినాధర్‌ (77) శుక్రవారం కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడంతో ఆయనను మదురైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. శుక్రవారం శ్యాస ఇబ్బందులు మరింత ఎక్కువడంతో వైద్యులు ఎంతగానో శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆయన అక్కడే తుదిశ్యాస విడిచారు. ఆయన మరణంతో ఆశ్రమంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. 1,500 సంవత్సరాల చరిత్ర కలిగిన శైవ మఠానికి ఆయన 292వ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు.

Madurai Adheenam pontiff passes away - Sakshi

అరుణగిరినాధర్‌ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామిలు సంతాపం వ్యక్తం చేశారు. శైవ మత సూత్రాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అమోఘం అని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటు అని ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామి సంతాపం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here