కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వనితా విజయ్‌కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. కోలీవుడ్ లో ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ అయిన మంజుల విజయ్‌కుమార్ కూతురే వనితా విజయ్ కుమార్. తాజాగా ఈమె కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందిన ఓ కొరియో గ్రాఫర్‌ను పెళ్ళి చేసుకుంది. ఇప్పటికే వనితాకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా గత 2 వివాహ బంధాలు ఊహించని పరిణామాల ఫలితంగా నిలబడకపోవడంతో తాజాగా ఆమె మూడో పెళ్లి చేసుకుంది. అయితే ఈ 3వ పెళ్లి జరిగిన వెంటనే ఆమె భర్తపై పోలీస్ కేసు నమోదవ్వడం ఆశ్చర్యకరమైన అంశం. ఈ ఘటన చెన్నైలో జరిగింది. ప్రస్తుతం కోలీవుడ్ సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

గతంలో వనితా విజయ్‌ కుమార్‌ కు 2 సార్లు వివాహమైంది. జరిగిన 2 పెళ్లిళ్లను అఫిషియల్‌గా రద్దు చేసుకున్నాక, వారు కేవలం మనస్పర్ధలతోనే విడిపోయారని తెలిసింది. తాజాగా వనితా విజయ్ కుమార్ 3వ పెళ్లి చేసుకుంది. చెన్నైలోని ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ లో క్రిస్టియన్ వివాహ పద్ధతిలోనే ఆమె పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ 3వ పెళ్లిలో ప్రత్యేకంగా వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా కనిపించిన వనిత గట్టిగా ప్రియుడిని ముద్దు పెట్టుకోవడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఈమధ్యనే పెళ్ళి బంధంతో ఒక్కటైన వనిత-పీటర్ పాల్ జంటపై పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు కంప్లైంట్ చేస్తూ.. తనతో విడాకులు కాకుండానే పీటర్ మరో పెళ్ళి చేసుకున్నాడని తన ఫిర్యాదులో పెర్కొన్నట్లుగా తెలిసింది. హెలెన్ ఫిర్యాదుతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ కొత్త జంటపై కేసు నమోదు చేసినట్లుగా తాజా సమాచారం.

అదండి సంగతి.. చదివారుగా.. సినీ సెలబ్రిటీల పెళ్ళి భాగోతాలు.. అరబ్ దేశాలలో ముస్లింలైన మగవాళ్ళు 7 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని విన్నాము. కానీ ఎంత సినీ హీరోయిన్ అయితే మాత్రం ఇన్ని పెళ్ళిళ్ళు అవసరమా.? అలా కాదని విధికి ఎదురీదితె ఫలితం ఇలాగే వుంటుందేమో.?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here