Connect with us

Featured

ఇది మా ఇంట్లో పెళ్లి… పబ్లిక్ పండుగ కాదు – నాగబాబు

Published

on

ప్రస్తుతం తెలుగు చలన సీమలో హీరో, హీరోయిన్ల పెళ్లి సంగతులతో సోషల్ మీడియా హోరెత్తి పోతుంది. ఈమధ్యనే యువ హీరో నిఖిల్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాగా, మరో హీరో నితిన్ పెళ్ళి వార్తలు కూడా వైరలయ్యాయి. టాలీవుడ్ భల్లాలదేవ రానా సంగతి చెప్పనవసరం లేదు. ఆల్ రెడీ తన ప్రేయసితో పెళ్ళి ఎప్పడన్నది చెప్పకనే చెప్పేశాడు. తాజాగా మెగా డాటర్ నిహారిక తనక్కాబోయే భర్తను హగ్ చేసుకుని మరీ ప్రేక్షక లోకానికి పరిచయం చేసేసింది.

సో మెగా కుటుంబంలో పెళ్ళి సందడి మొదలవ్వబోతుంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందన్నమాట. ఇదే అంశాన్ని మెగా బ్రదర్ నాగబాబు వద్ద ప్రస్తావించగా.. “ఇది మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నానని త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా భారీస్ధాయిలో పెళ్లి చేయడం కుదరకపోవచ్చని, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే పెళ్లి చేయాల్సి వస్తుందేమోనని తెలియజేశారు. ఇంతకీ నిహారికకి కాబోయే భర్త ఎవరనే దిశగా ఆరా తీస్తే.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే..

మెగా ఫ్యామిలీలోకి ఎంటరవ్వబోతున్న ఆ వ్యక్తి గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్న‌ల‌గ‌డ్డ చైతన్య అని, అతను పుట్టింది, పెరిగింది అంతా హైద‌రాబాద్ లోనే అని, ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పీజీ చేశారని, బిట్స్ పిలానీలో చదువుకున్న అయన ప్రస్తుతం టెక్ మహీంద్రా సంస్థలో పెద్ద హోదాలో ఉన్నట్లు తెలిసింది. ఇక వీళ్ళిద్దరి నిశ్ఛితార్ధం ఆగస్టు నెలలో జరగనుంది. ఆ తర్వాత పెళ్లి వేడుకను వీలైనంత సాధారణ స్ధాయిలోనే నిర్వహించనున్నట్లు ఈమధ్యనే ఈ రెండు కుటుంబాలు క‌ల‌సి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తాజా సమాచారం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Rajamouli: రాజమౌళికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన జపాన్ వాసులు.. నెట్టింట పోస్ట్ వైరల్!

Published

on

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. వేల కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. అంతేకాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగా సినిమా విడుదల అయ్యి రెండేళ్లు కావస్తోంది.

2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి హిట్ కొట్టి అనేక ఇంటర్నేషనల్ అవార్డులు అందుకొని ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి బెస్ట్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించి ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాని అనేక దేశాల్లో రిలీజ్ చేసారు. అందులో జపాన్ కూడా ఒకటి. మన ఇండియన్ సినిమాలకు అమెరికా తర్వాత జపాన్ అతిపెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్. ముఖ్యంగా తెలుగు సినిమాలకు. దీంతో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిసి మరీ వెళ్లి ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసారు. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డు కలెక్షన్స్ జపాన్ లో ఆర్ఆర్ఆర్ సాధించింది.

అంతే కాకుండా జపాన్ ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు. జపాన్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజయి రెండేళ్లు అవుతున్నా ఇంకా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పై అభిమానం చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాని రీ రిలీజ్ చేశారు. దీంతో రాజమౌళి మరోసారి జపాన్ కి వెళ్లారు. ఇక రాజమౌళి జపాన్ కి వెళ్లడంతో అక్కడి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. రాజమౌళిని చూసి అభిమానులు సంతోషిస్తున్నారు.
రాజమౌళి కోసం స్పెషల్ గిఫ్ట్

Advertisement

అయితే ఒక బామ్మ రాజమౌళి కోసం స్పెషల్ గిఫ్ట్ చేసుకొచ్చింది. దీంతో రాజమౌళి ఆ గిఫ్ట్ తీసుకొని ఆ బామ్మతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. జపాన్ లో ఆర్గామి క్రేన్స్ అనే గిఫ్ట్ తమకి ఇష్టమైన వాళ్ళ కోసం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని తయారు చేస్తారు. ఒక 83 ఏళ్ళ మహిళ అలాంటివి 1000 తయారుచేసి తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించింది. ఆర్ఆర్ఆర్ ఆమెకు సంతోషం ఇచ్చింది. నాకు గిఫ్ట్ పంపి బయట చలిలో ఎదురుచూస్తుంది. ఇలాంటి వాటికి ఋణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు. దీంతో రాజమౌళి ట్వీట్ వైరల్ గా మారింది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: జగన్ సారా వ్యాపారి.. వచ్చేది రామ రాజ్యమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్!

Published

on

Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన ప్రజాగళం భారీ సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే కురుక్షేత్ర సమరం తర్వాత ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని తెలిపారు. ప్రస్తుతం రావణాసురు పాలన సాగుతుందని త్వరలోనే రామరాజ్యం వస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం డబ్బు అండతో విర్రవీగిపోతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి రేటు పూర్తిగా పడిపోయిందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఒక సంక్షేమం లేదని అభివృద్ధి జరగలేదని నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఇక దేశమంతా డిజిటల్ రంగంలో ముందుకు దూసుకుపోతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్యం దుకాణాల వద్ద ఇంకా నగదు బదిలీ చేపడుతూ భారీగా దోచుకుంటున్నారని తెలిపారు. ఈయన ఒక సారా వ్యాపారి అంటూ పవన్ ఎద్దేవా చేశారు.

Advertisement

డ్రగ్స్ రాజధాని..
కేవలం మద్యం విషయంలో మాత్రమే కాదు ఇసుక తవ్వకాలలో కూడా జగన్ బినామీలు సుమారు 40 వేల కోట్ల వరకు దోచుకున్నారని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిపోయింది అంటూ జగన్ పరిపాలనపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కురిపిస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా పవన్ తమ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Continue Reading

Featured

AP politics: బాబుని సీఎం చేయటం మోడీ అజెండా కాదు.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ!

Published

on

AP politics: ప్రస్తుతం జరగబోయే ఏపీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగ మారాయి. జగన్ ఒక్కడే ఒక వైపు ఉండగా మరోవైపు జనసేన టిడిపి బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇలా ఈ పార్టీలన్నీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో మొదటిసారి చిలకలూరిపేట వద్ద ప్రజాగళం అనే పేరిట భారీ సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి విమర్శలు చేస్తారో అన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు .అయితే ఈ సభలో మోడీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సభలో మోడీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఈయన తెలిపారు. ఎక్కడ కూడా జగన్ గురించి మాట్లాడలేదు అలాగే రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదు పోలవరం గురించి ప్రశ్నించలేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ ప్రభుత్వంలోని మంత్రుల గురించి మాట్లాడారే తప్ప జగన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలి అని కూడా ఎక్కడా చెప్పలేదు. ఎన్డీఏకి ఓట్లు వేసి గెలిపించండి అని మాత్రమే కోరారని నాగేశ్వరరావు తెలిపారు. ఇక్కడ మోడీ గారికి చంద్రబాబు నాయుడుని గెలిపించడమే అజెండా కాదని ఈయన తెలిపారు.

Advertisement

జగన్ పై ఎక్కడ విమర్శలు చేయలేదు..
రేపు ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అలాగే జగన్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా మోడీకి అవసరం కనుక ఈయన ఎక్కడ కూడా జగన్ కు ఓటు వేయొద్దని చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండని చెప్పలేదు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలి అనే అజెండా కనుక ఉండి ఉంటే ఈ సభలో జగన్ పై విమర్శలు చేసేవారు కానీ మోడీ ఎక్కడ కూడా అలా ప్రసంగించలేదు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన అనాలసిస్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!