కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ఇటు మన దేశంలో కూడా కరోనా బాదితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపద్యంలో కరోనా కట్టడికోసం ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వైరస్ ను నియంత్రించడం సాధ్యపడటం లేదు. లాక్ డౌన్ పై కేంద్రం ఇచ్చిన సడలింపులతో భారీగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దీనితో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రోజుకు దాదాపు 150 కొత్త కేసులు నమోదవుతుండటం ఆంధోళన చెందాల్సిన విషయం.

హైదరాబాద్ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.

తాజాగా ఈ విషయం పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలంచేకూరేలా మారాయి. హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్న ఈ సమయంలో నగరంలో మళ్ళీ సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే నగరంలో లాక్ డౌన్ విధించాలా వద్దా అనే దానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చర్చలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు‌. అయితే లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు మంత్రి తలసాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here