పీజీ చదువుతూ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ గా యువతి.. వైరల్ వీడియో!

0
86

మనకు కష్టపడే గుణం ఉండాలి కానీ పని చిన్నదా పెద్దదా అనే ఆలోచన లేకుండా ఆ పనిని ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలము. సాధారణంగా మహిళలు కేవలం కొన్ని పనులకు మాత్రమే పరిమితం అని భావిస్తుంటారు. కానీ అలా భావించడం పూర్తిగా తప్పని కేరళకు చెందిన 24 సంవత్సరాల యువతి దెలిషా డేవిస్ నిరూపించారు. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసి నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని తన పనిని తాను ఎంతో ఇష్టపడుతూ మగువలందరికి ఎంతో ఆదర్శంగా నిలబడిందని చెప్పవచ్చు.

మగవాళ్ళకే ఎంతో కష్టంగా ఉండే ఈ డ్రైవింగ్ ను ఎంచుకున్న దెలిషా డేవిస్ తన వృత్తిని ఎంతో ఇష్టపడుతున్నట్లు తెలిపారు. సుమారు 300 కిలోమీటర్ల పాటు ఏమాత్రం అలుపు లేకుండా పెట్రోల్ ట్యాంకర్‌ను నడుపుతూ డ్రైవింగ్ వృత్తిని ఎంతో ఆస్వాదిస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వృత్తిపరంగా దెలిషా తండ్రి కూడా లారీ డ్రైవర్ కావడంతోనే ఆమెకు ఈ వృత్తిలో మంచి పట్టు, ఇష్టత నెలకొని ఉంది. తన తండ్రి ప్రోత్సాహం వల్లనే తను ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిపారు.

గత మూడు సంవత్సరాల నుంచి తన పెట్రోల్ ట్యాంకర్ ను రోడ్డు పై పరుగులు పెట్టిస్తున్న ఈమె ఒకసారి రోడ్డు రవాణా శాఖ అధికారుల కంటపడింది. అన్ని బండ్లను ఆపిన విధంగానే ఈమె ట్యాంకర్ ను కూడా అధికారులు ఆపగా డ్రైవింగ్ చేస్తున్నది ఒక యువతి అని తెలుసుకొని అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్, ప్రమాదకర వస్తువులను రవాణా చేసే లైసెన్స్ చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.

ఈ సందర్భంగా దెలిషా మాట్లాడుతూ మల్టీయాక్సిల్ వోల్వో బస్సును నడపాలన్నదే తన కలని అందుకు వీలుగా ప్రత్యేక లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విధంగా డ్రైవింగ్ ఎంచుకున్న ఈమె చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చదువును కూడా కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలబడిందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here