టీమ్ ఇండియా కోచ్ కోసం బిసిసిఐ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం బోర్డు ఇప్పటీకే దరకాస్తులకు ఆహ్వానించింది. చాంపియన్స్ ట్రోఫీతో ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే పదవీకాలం ముగియనుండటంతో అతని స్థానంలో కొత్త కోచ్ ని వెతికే పనిలో పడింది బిసిసిఐ. టీమ్ ఇండియా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే స్థానంలో రాహుల్ ద్రావిడ్ సరియైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్. భారత జట్టు కోచ్ గా సేవలందించేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని.. అయినా కుంబ్లేకి తోలి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నాడు. లేకపోతే క్రికెట్ లో మూడు ఫార్మేట్ ల మీద మంచి అవగాహన ఉన్న రాహుల్ ద్రావిడ్ ఆ స్థానానికి పూర్తి న్యాయం చేయగలడని అభిప్రాయం వ్యక్తం చేసాడు. కోచ్ ఎంపిక కోసం బిసిసిఐ ఎన్నో విషయాలను పరిగణంలో కి తీసుకుంటుంది. ద్రావిడ్ కంటే మెరుగైన వారిని బిసిసిఐ తీసుకురాలేదని అభిప్రాయపడ్డాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here