సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుషులందరూ ఒక వైపు, నేను ఒక్కడిని ఒక వైపు అనే డైలాగ్ రాంగోపాల్ వర్మ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది. తను అనుకున్నది అనుకున్నట్లుగా, ఎవరు ఏం చెప్పినా తన మార్క్ మాత్రం వదలకుండా తన స్టైల్లో సినిమాను పూర్తి చేసి ప్రజల్లోకి వదులుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఒకసారి రాంగోపాల్ వర్మ గురించి చూస్తే ఆయన 1962లో తూర్పుగోదావరి జిల్లాలోని కృష్ణం రాజు, సూరమ్మ దంపతులకు జన్మించారు. ఈయన విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు. ఇంజనీరింగ్ అయితే పూర్తి చేశారు కానీ, తనకు చిత్ర రంగం మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది. చిన్నప్పుడు నుండి తాను చూసి వచ్చిన సినిమాలను తన స్నేహితులతో కూర్చుని ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ అందులోని తప్పుల గురించి వాదనలు చేసుకునేవాడు.

తను ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసిన మొదట్లో బ్రతుకుతెరువు కోసం ముందుగా ఒక వీడియో దుకాణం నడిపాడు. ఆ తర్వాత “రావు గారి ఇల్లు” అనే తెలుగు చిత్రానికి సహాయ దర్శకుడిగా అవకాశం లభించడంతో ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జున ను కలవడంతో, ఆయన అక్కడ నాగార్జునతో ఏర్పరచుకున్న బంధంతో ఆయన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జునతో కలిసి శివ సినిమా తీశాడు. 1990 లో నిర్మించిన శివ అ చిత్రానికి ఇప్పుడు కూడా ఇలాంటి క్రేజ్ తగ్గలేదు. అంతలా అలా ఆ సినిమాను రాంగోపాల్ వర్మ తెరకెక్కించాడు. అయితే ఆ తర్వాత తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీలో ను కూడా అడుగుపెట్టాడు. అక్కడ కొన్ని సినిమాలు చేసిన తర్వాత అతని నిర్మాణసంస్థ వర్మ కార్పొరేషన్ ద్వారా పలు చిత్రాలను బాలీవుడ్ కు అందించారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన శివ, క్షణక్షణం బాగా హిట్ అవ్వగా, ఇక హిందీ సినిమాలలో రంగీలా, సత్య, కంపెనీ, బూత్ సినిమాలు రాంగోపాల్ వర్మ మార్కును చూపెట్టాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డును మూడు సార్లు అత్యుత్తమ దర్శకుడిగా ఆయన అవార్డులను గెలుచుకున్నారు. అలాగే సత్య సినిమా కి ఫిలిం ఫెయిర్ వాళ్ళు ఇచ్చే ఉత్తమ దర్శకుడిగా కూడా ఆయన అవార్డు గెలుచుకున్నారు. ఇక తాజాగా లాక్ డౌన్ సమయం లో రామ్ గోపాల్ వర్మ ఫిలిమ్స్ అనే వెబ్ సైట్ ద్వారా తాను నిర్మించిన సినిమాలను విడుదల చేస్తూ సంపాదిస్తున్నాడు.

ఇక రామ్ గోపాల్ వర్మ ఆస్తిపాస్తులు విషయానికి వస్తే… ఆయన చాలా ఇంటర్వ్యూలో తన ఆస్తిపాస్తులను గురించి అడిగినా ఎటువంటి విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. అయితే అందిన సమాచారం మేరకు… 50 కోట్లకు పైగానే తన ఆస్తిపాస్తులు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఆయన కార్ల కలెక్షన్ చూస్తే… ఆయనకు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ క్లాస్ సంబంధించిన కారు ఒకటి ఉంది. అంతేకాకుండా వివిధ నగరాలలో ఆయనకు ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఆయన సొంత ఇల్లు, ఆఫీస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈయన పర్సనల్ విషయానికొస్తే… అనేక మంది హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసినదే. ఈయనకు ఇదివరకే రత్న వర్మ అని ఆవిడతో వివాహం జరిగి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఒక అమ్మాయి కూడా ఉన్నారు. కూతురు పేరు రేవతి. అలాగే రామ్ గోపాల్ వర్మ కి వర్మ విజయ, వర్మ కోటి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here