బాలీవుడ్ నటి, సింగర్, బిగ్ బాస్ కంటిస్టెంట్ మరియు మోడల్ షెహనాజ్ గిల్ తండ్రి సంతోఖ్ సింగ్ పై అత్యాచారం కేసు నమోదైంది. యువతిని గన్ చూపించి చంపుతానని బెదిరించి రేప్ చేసారంటూ ఆయనపై పోలీసులకు పిర్యాదు చేసారు బాధితురాలి కుటుంబం. వివరాల్లోకి వెళితే…

స్నేహితురాలిని కలిసేందుకు మరో స్నేహితుడితో కలిసి బాధితురాలు బియాస్ గ్రామానికి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ ఉన్న సంతోఖ్ సింగ్ తుపాకీ చూపించి చంపుతానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం. మే 14 వ తారీఖు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగినట్టు చెబుతున్నారు. అయితే ఈ దారుణం మే 14 న జరిగినప్పటికీ పోలీసులకు పిర్యాదు చేసేందుకు బాధితురాలి కుటుంబం భయపడినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఉన్న ఒక వ్యక్తి చొరవతో బాధితురాలి కుటుంబం పోలీసులకు పిర్యాదు చేసారు. ఈమేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here