Remove Stone Without Operation

0
162

ఆపరేషన్ లేకుండా కిడ్నీలో రాళ్ళు తొలగించుకోండి ఇలా ..!

నేషనల్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఎగ్జామినేషన్‌ సర్వే ప్రకారం ఇండియాలో పురుషుల్లో 10.6 శాతంమందిలో, మరియు స్త్రీలల్లో 7.1 శాతం మందిలో మూత్రపిండాల్లో ఇప్పుడు రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి మారిన జీవనశైలి, ప్రపంచ ఆధునికీకరణ, మారిన ఆహారపు అలవాట్లు, స్థూలకాయం వంటివి ప్రధాన కారణాలు. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసి అందులోని హానికరమైన మరియు విషతుల్యమైన పదార్థాలను మూత్రం రూపంలో బయలకు పంపించివేస్తాయి. అయితే రక్తంలో కాల్షియం ఆక్సలేట్స్, యూరిక్ ఆసిడ్, సిస్టీన్ వంటి పదార్థాలు బయటకు విడుదల అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి అవి ఒకచోట పేరుకుపోతుంటాయి. ఇవే రాళ్ల రూపంలోకి మారుతాయి. కొన్ని రకాల మందులు (మెగ్నీషియం) వలన కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. చాలా సందర్భాల్లో ఈ రాళ్లు చాలా చిన్నవిగా ఉంటూ మూత్రంలో వెళ్లిపోతాయి. పెద్దగా ఉంటే మాత్రం ఆపరేషన్ వంటి సమస్యలు తప్పవు.. రాళ్ల పరిణామం బట్టి వ్యాధి లక్షణాలు మొదలవుతాయి. తీవ్రమైన నడుం నుంచి గజ్జలలోకి నొప్పి వస్తుంది. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. వికారంతో కూడిన వాంతులు, తీవ్రమైన జ్వరం, విపరీతమైన చెమటలు, నీరసం, మూత్రంలో రక్తం పడటం, మూత్రవిసర్జన సమయంలో మంట రావడం వంటి సమస్యలు కలుగుతాయి. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడే వక్తుల్లో కనబడే అతిపెద్ద లక్షణం మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడటం. దీన్ని కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే తత్వం అంటారు.

కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణాలు:
1. చాలా సందర్భాలలో కిడ్నీల్లో రాళ్లు రావటానికి గుర్తుతెలియని కారణాలు ఉంటాయి. రాళ్లలో ఉండే ప్రధానమైన పదార్థం కాల్షియం. అలాగే ఆక్సలేట్‌, యూరిక్‌ ఆసిడ్‌ మరియు సిస్టెన్‌ కలిసి ఉండే రాళ్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి.
2. ఎక్కువగా వేడి వాతావరణంలో ఉండటం, శరీరంలో ద్రవ పరిణామం తగ్గటం, నీళ్లు తక్కువగా తాగటం వంటి కారణాల వల్ల మూత్రం మోతాదు తగ్గుతుంది. కావున మూత్రంలోని విష, అనవసరమైన పదార్థాలు గడ్డకట్టుకుపోయి మూత్రపిండాల్లో రాళ్లుగా మారతాయి.
3. కొన్ని రకాల మందులు వాడటం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.
4. తరచుగా వచ్చే మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల వల్ల కూడా రావొచ్చు.
5. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.
అయితే కిడ్నీలో రాళ్లను కింద వీడియోలో చెప్పిన విధంగా టిప్స్ ను అనుసరించి ఆపరేషన్ లేకుండానే పడిపోయేలా చేసుకోవచ్చట. మీరు కూడా తెలుసుకునేందుకు కింది వీడియో క్లిక్ చేయండి..

Top Telugu website in the world | Telugu Gossips, Breaking News Headlines, Health news, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here