కరోనా మహమ్మారి సంక్షోభంతో అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆయా కంపెనీల షేర్లు కూడా భారీగా దెబ్బతిన్నాయి. అనేక మంది పారిశ్రామిక దిగ్గజాల ఆదాయం ఆవిరైపోతుంది. మరో పక్క లాక్ డౌన్ కారణంగా కస్టమర్లు రాక, కొనుగోళ్లు లేక అనేక బడా షాపింగ్ మాల్స్ కూడా వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో ఆయా వ్యాపార సంస్థల యాజమాన్యాలు డీలా పడిపోతున్నారు. కానీ ఎవెన్యూ సూపర్ మార్కెట్ల అధినేత రాధాకిషన్ ధమాని ఆదాయం మాత్రం అమాంతం పెరిగిపోయింది. అత్యంత సంపన్నులైన భారతీయులలో ఈయన ఒకడయ్యాడు. కరోనా సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థలు కకావికలమవుతున్నప్పటికీ రాధాకిషన్ సంపద విలువ మాత్రం ఈ ఏడాది 5 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక ఆయన సంపదలో సింహ భాగం అయిన అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్ల విలువ ఈ ఏడాది 18% పెరిగిందని బ్లూంబర్గ్ సంస్థ తెలిపింది.

ఒకప్పుడు ముంబైలో చిన్న గదిలో ఉంటూ వచ్చిన రాధాకృష్ణ ఇప్పుడు బిలినియర్ అయ్యారంటే దానికి కారణం అయన సూపర్ మార్కెట్ల చైన్ మాత్రమే.. లక్ డౌన్ కారణంగా నిత్యావసర వస్తువుల కోసం చాలా మంది ప్రజలు ఈ మార్కెట్లపై పడ్డారు. ధరలు పెరిగినా పట్టించుకోకుండా కస్టమర్లంతా ఒక్కసారిగా వీటిమీద ఎగబడ్డారు. దొరికింది దొరికినట్టు కొనేశారు.

గత ఫిబ్రవరిలో ముకేశ్ అంబానీ తరువాత ధమాని రాధాకృష్ణ రెండో బిలినియర్ గా నిలిచారు. అయితే కరోనాపై పోరాటంకోసం పీఎం కెర్ ఫండ్స్ కు ధమాని 100 కోట్లు విరాళం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here