భారతదేశ చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ తర్వాత అత్యధికంగా సంపన్నుల చిత్ర జాబితాలో టాలీవుడ్ నిలుస్తుంది. ఇప్పటికే చాలామంది టాలీవుడ్ కథానాయకులు వారి సొంత ఇంటి కలిగి ఉండటమే కాకుండా అనేక సొంత వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. నిజానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేకమంది కథానాయకులు ఒక్కో సినిమాకి భారీ వేతనం పుచ్చుకుంటున్నారు. అంతే కాదు వారు అనేక వ్యాపార రంగాల్లో విజయవంతమయ్యారు కూడా.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా నిర్మాణాన్ని కూడా హీరోలు పంచుకుంటున్నారు. హీరోలు వారి మార్కెట్ మరియు బడ్జెట్ ఆధారంగా సినిమాకు వచ్చే ఆదాయం లో 30 నుండి 40 శాతం వరకు లాభాలను డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ హీరోలు బయట రిటైల్ మరియు రియల్ ఎస్టేట్ వ్యవహారాలతో పాటు అనేక వ్యాపారాలలో ముందుకు వెళ్తున్నారు. అలాగే మన టాలీవుడ్ లో అత్యధిక ధనవంతులు అయిన వారి లిస్టు చూద్దామా…

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోలలో అత్యధికంగా ఆస్తులు కలిగిన వ్యక్తిగా అక్కినేని నాగార్జున ఉన్నారు. ఆయన నటుడే కాకుండా ఒక వ్యాపారవేత్త కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈయనకు ఏకంగా తన ఆస్తి మూడు వేల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. హైదరాబాద్ నగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్, అలాగే బెంగళూరు నగరంలోని కొన్ని వ్యాపారాలు అలాగే అనేక నగరాల్లో ఉన్న వ్యాపారంలో విలాసవంతమైన భవనాలను అక్కినేని నాగార్జున కలిగి ఉన్నారు. ఈయనకు తన తండ్రి నుండి వారసత్వంగా నటనతో పాటు అనేక ఆస్తులు కూడా సంక్రమించాయి.

ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ ధనవంతుడు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన పేరు ఎటువంటి డోకా తీసుకురాకుండా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా అల్లు అర్జున్ కొనసాగుతున్నాడు. ఇక అల్లు అర్జున్ తండ్రి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నుండి కూడా ఈయనకు చాలా ఆస్తులు రాగ, మరోవైపు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి నుండి వచ్చిన ఆస్తులు మొత్తం కలిపి చూస్తే మూడు వేల కోట్లకు పైనే ఆయన ఆస్తులు వచ్చి చేరాయి. అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాకి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో మొదటి వరుసలో ఉన్నాడు బన్నీ. మరోవైపు టీవీ యాడ్స్ ద్వారా కూడా కోట్లలో గడిస్తున్నారు ఆయన.

ఇక అల్లు అర్జున్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధికంగా ఆస్తి కలిగిన వ్యక్తిగా రామ్ చరణ్ తేజ పేరు చెప్పుకోవచ్చు. ఈయన ఏకంగా తన తండ్రి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని దాటి పోయాడు. తన తండ్రికి మించి ఆస్తులను సంపాదించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ తేజ తన తండ్రి నటన వారసత్వాన్ని నూరు శాతం పుణికి పుచ్చు కోవడం తో హీరో గా కొనసాగుతున్నాడు. అయితే రామ్ చరణ్ తేజ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బయట వ్యాపార వ్యవహారాల్లో కూడా దూసుకెళ్తున్నాడు. ఇదివరకే తన తండ్రి నటించిన సైరా సినిమాను రామ్ చరణ్ తేజ నిర్మించాడు కూడా. అలాగే అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలిని పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ తేజ్ కు ఆమె నుండి అనేక ఆస్తులను సంపాదించుకున్నాడు రామ్ చరణ్ తేజ. ఇక వీటన్నిటిని లెక్క వేసి చూస్తే దాదాపు 2800 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆస్తుల పరంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పవచ్చు. మొదట్లో ఎటువంటి ఆదరణ లేక పోయినా తాను సినిమాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబ ఆదరణ పెరగడంతో పాటు, స్టూడియో ఎన్ అధినేత కుమార్తెను పెళ్ళి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు అన్ని ఆస్తులు కలుపుకొని వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని టాలీవుడ్ అంచనాలు. ఆ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి చెప్పవచ్చు. ఆయన కూడా దాదాపుగా 500 కోట్లకు పైగా ఉందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బడా కోటేశ్వరుడు గురించి మాట్లాడితే… మంచు ఫ్యామిలీ నుండి నట వారసుడిగా వచ్చిన మంచు విష్ణు కు తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు అలాగే తన భార్య నుండి వచ్చిన ఆస్తులను కలుపుకొని చూడగా మంచు విష్ణుకు 700 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు గురించి చెప్పుకోవాలి. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుండి సంక్రమించిన ఆస్తులతో పాటు, తన నటించిన సినిమాలకు అలాగే వ్యాపార ప్రకటనలకు సంబంధించి వచ్చిన ఆస్తులు ఏకంగా వెయ్యి కోట్ల వరకు ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక ఆ తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీ లో నుంచి వెంకటేష్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా కోట్లకు పడగెత్తిన టాలీవుడ్ స్టార్ లు ఎందరో మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here