సీత ఒక దక్షిణ భారతీయ సినీ నటి, నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో పనిచేసింది. సీత 1985 లో తమిళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించింది. ఐదు సంవత్సరాల పాటు హీరోయిన్ గా పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది.

సీత తండ్రి స్వస్థలం విజయనగరం జిల్లా, బొబ్బిలి. సీత చిన్నప్పుడే ఆమె తండ్రి మోహన్ బాబు మెడికల్ రెప్రెజెంటేటివ్ గా చెన్నైలో స్థిరపడ్డాడు. మోహన్ బాబు సినిమాల్లో నటుడిగా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుండేవాడు. సీత మోహన్ బాబు, చంద్రావతి దంపతులకు 1964లో చెన్నైలో జన్మించింది. ఆమెకు పాండు, దుష్యంత్ అనే ఇరువురు సోదరులున్నారు. తన తండ్రి సినీ నేపథ్యంలో ముందుగా సీత సీల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన, సీత 1985 లో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. 1985 నుంచి 1990 దాకా ప్రముఖ కథానాయికల్లో ఒకటిగా ఆమె హీరోయిన్ గా కొనసాగింది. ఆడదే ఆధారం చిత్రానికి గాను ఆమెకు నంది పురస్కారం లభించింది.

ఇలా ఉండగా సీత ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్ తో ప్రేమలో పడి 1990లో అతన్ని వివాహం చేసుకుంది. వారికి అభినయ, కీర్తన అనే ఇద్దరు కూతుర్లు, రాఖీ అనే ఓ దత్తపుత్రుడు ఉన్నారు. పార్థిబన్ ను వివాహం చేసుకున్న తర్వాత నటనలో విరామం తీసుకుంది. 2001 లో ఆమె వ్యక్తిగత కారణాల వలన పార్థిబన్ నుంచి విడిపోయింది. 2010 లో టీవీ నటుడు సతీష్ ను వివాహం చేసుకున్నది. కీర్తన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అమృత అనే సినిమాలో నటించింది. ఆమెకు ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ బాలనటిగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఖాళీ సమయాల్లో ఆమె తంజావూరు పెయింటింగ్స్ కూడా వేస్తుంటుంది. మరల 2002 లో మారన్ అనే తమిళ సినిమాతో పునరాగమనం చేసింది. 2004 లో తమిళ సినిమా రైటా తప్పా అనే సినిమాకు గాను తమిళనాడు రాష్ట్ర ఉత్తమ సహాయనటి పురస్కారం అందుకుంది. ఇక టాలీవుడ్ లో ఆవిడ ఇంద్ర, సంబరం, గంగోత్రి, సింహాద్రి, బన్నీ, వాన, అతడే ఒక సైన్యం లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించింది. సీత కుమార్తె అభినయకు కూడా చిత్రకళలో ప్రవేశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here