ఈటీవీలోని నా పేరు మీనాక్షి, స్టార్ మాలో ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బుల్లితెర నటి నవ్య స్వామి. చక్కటి అందంతో పాటు మంచి అభినయంతో ప్రతీ ఇంట్లోనూ మహిళా ప్రేక్షకాభిమానుల మనసులను దోచేసింది నవ్య. తన కెరీర్ ప్రారంభంలోనే డాక్టర్ కావాలనుకున్న నవ్య చివరకు యాక్టర్ అయ్యింది. ముందుగా తమిళ్ సీరియల్ వాణి – రాణి ద్వారా బుల్లితెరకు పరిచయమైన నవ్య, అటు తెలుగు, ఇటు కన్నడ సీరియల్స్ లో కూడా తన నటనతో అందర్నీ మెప్పించింది. మైసూరుకు చెందిన ఈ భామ తెలుగులో బాగా రాణించింది. తెలుగు భాషలో స్పష్టంగా కూడా మాట్లాడగలుగుతుంది. ఇక ప్రస్తుతాంశానికొస్తే..

వెండితెర, బుల్లితెర అనే తారతమ్యాలు లేకుండా అన్ని రంగాలలోనూ కరోనా మహమ్మారీ కలవరం పుట్టిస్తోంది. నిన్నా.. మొన్నటి వరకూ లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో సినీ కార్మికులు నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. అయితే ఈమధ్యనే షూటింగ్ లు ప్రారంభం కావడంతో నటీనటులకు కరోనా సోకుతుందన్న భయం ఎక్కువైపోతుంది. ఇప్పటికే ముద్దుబిడ్డ, సూర్యకాంతం వంటి సీరియల్స్ లో నటించిన ప్రభాకర్‌ అనే నటుడికి కరోనా పాజిటివ్ వచ్చిందనే రూమర్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత కరోనా భాధితుడు మన తెలుగు ప్రభాకర్ కాదని కన్నడ టీవీ ఆర్టిస్ట్ ప్రభాకర్ అని తెలియడంతో బుల్లితెర కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ తాజాగా మరో టీవీ సీరియల్ గృహలక్ష్మిలో నటించే హరికృష్ణ అనే నటుడికి, ఈటీవీలో ప్రసారమయ్యే  నా పేరు మీనాక్షి, స్టార్ మాలో ప్రసారమయ్యే ఆమె కథ సీరియల్స్ లో హీరోయిన్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.

ఇలాగే మరో టీవీ నటుడు ఓంకార్ కూ కూడా కరోనా పాజిటివ్ వచ్చిందనే రూమర్స్ వెలుగులోకి రావడంలో బుల్లితెర ఆర్టిస్టులందరూ బెంబేలెత్తిపోతున్నారు. నా పేరు మీనాక్షి, ఆమెకధ ఈ 2 సీరియల్స్ లోనూ లీడ్ రోల్ నవ్య కావడంతో ఆమె లేకుండా సీరియల్ కొనసాగే అవకాశాలు లేవు. ప్రస్తుతం నవ్య స్వామి.. ఈ కరోనా వైరస్ కి చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం. అదండి సంగతి.. చదివారుగా కరోనా భూతానికి బుల్లితెర ఆర్టిస్టులు కూడా ఎలా షేకైపోతున్నారో.. కాబట్టి మీరూ కరోనా కబంధ హస్తాలలో చిక్కుకోకుండా ఇప్పట్నుంచే జాగ్రత్త పడండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here