సోనూ సూద్ పేదల సాయం వెనుక అసలు నిజం ఇదా..?

0
322

సోనూ సూద్ సినిమాల్లో విలన్. ఎలాంటి విలన్ రోల్ నైనా అవలీలగా తన నటనతో మెప్పించగల నటుడు. తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా ఈ స్టార్ విలన్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు. కరోనా, లాక్ డౌన్ సమయంలో పేదలకు సాయం చేసి సోనూ సూద్ వార్తల్లో నిలిచారు. ఇప్పటికీ ఆయన ఎంతోమంది పేదలకు సాయం చేస్తూనే ఉన్నారు. స్టార్ హీరోలకు, ప్రముఖులకు కూడా అసాధ్యమైన వాటిని సోనూ సూద్ సాధ్యం చేశారు.

 

ఈ స్టార్ విలన్ కు పారితోషికం తక్కువే అయినప్పటికీ భారీ మొత్తంలో వలస కార్మికుల కోసం, పేదల కోసం, విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్నారు. దీంతో కొంతమంది సోనూ సూద్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రచారం చేయగా మరి కొంతమంది సోనూ సూద్ కు ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది..? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. సోనూ ప్రజలకు మంచే చేస్తున్నా కొందరు మాత్రం ఆయనపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారు.

అయితే సోనూ తాజాగా స్పందించి నెటిజన్లలో వ్యక్తమవుతున్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. పరిమితులు లేకుండా అసాధారణ స్థాయిలో డబ్బులు ఖర్చు చేయడానికి, సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి గల కారణాలను వివరించారు. తాను జనాలు ఊహించిన దాని కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నానని.. ఎంతోమంది సాయం చేస్తూ సహాయసహకారాలు అందిస్తుండటం వల్లే ఈ సేవా కార్యక్రమాలు సాధ్యమవుతున్నాడని పేర్కొన్నారు.

తమ కుటుంబాలకు వ్యాపారాలు ఉన్నాయని.. సినిమాల ద్వారా తను కూడా డబ్బులు సంపాదించానని అన్నారు. ఎంతోమంది మంచి మనుషులు చేతులు కలపడం వల్లే ఈ సాయాలు చేయడం సాధ్యమవుతుందని వెల్లడించారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని.. కొన్ని పార్టీల నేతల నుంచి ఇప్పటికే తనకు పార్టీలో చేరాలని ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు. తాను నిస్వార్థంగా సేవ చేస్తున్నానని.. ఏదో ఆశించి మాత్రం తాను చేయడం లేదని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here