నోరూరించే స్పైసీ నాటుకోడి పులుసు ఎలా తయారుచేయాలో చూద్దాం…

కావలసినవి:

చికెన్: 1 kg(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 3 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tbsp
టమోటాలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పెరుగు: 2tbsp
పచ్చిమిరపకాయలు: 3- 4 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ధనియాలు: 1tbsp
జీలకర్ర: ½tbsp
ఎండు కొబ్బరి తురుము: 2tbsp
వెల్లుల్లి: 3-6రెబ్బలు
పసుపు: 1tsp
కారం: ½tsp
గరం మసాలా పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3tbsp
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నీళ్ళు: 1cup

తయారుచేయు విధానం:

1.ముందుగా స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి, అందులో ధనియాలు, జీలకర్ర, కొబ్బరి తురుము మరియు వెల్లుల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు.

2. చికెన్ శుభ్రంగా కడిని పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు పాన్ వేడిచేసి, నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

4. తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్, పసుపు, కారం, వేసి బాగా మిక్స్ చేస్తూ 5నిముషాలు వేగించుకోవాలి.

5. ఇప్పుడు అందులోనే టమోటో ముక్కలు, మిరియాల పేస్ట్, గరం మసాలా పౌడర్, పెరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తూ, వేగించుకోవాలి. తర్వాత 5-10 ఉడికించుకోవాలి.

6. ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మసాలా చికెన్ ముక్కలకు పట్టేలా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.

7. తర్వాత అందులో నీళ్ళు పోసి మిక్స్ చేయాలి. మూత పెట్టి మీడియం మంట మీద 20నిముషాలు ఉడికించుకోవాలి.

8. ఒక్కసారిగా చికెన్ ముక్కలు ఉడికించుకొన్న తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here