కోలీవుడ్ సినీతారలలో మీరా మిథున్ ఒకరు. మీరా మిధున్ కన్నా ముందు కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ త్రిష. అయితే కోలీవుడ్ లో త్రిషకున్నన్ని వివాదాలు మరేనటికీ వుండవన్న సంగతి సోషల్ మీడియాలోని నెటిజన్లందరికీ తెలుసు.

మీరా మిథున్‌తో త్రిష ఎప్పటి నుంచో గొడవలు పడుతుంది. అందుకే తనకు ఛాన్స్ లభించినపుడల్లా మీరా మిథున్ కూడా ఏదో ఒక రూపంలో త్రిష‌ను కామెంట్ చేస్తుంది. తాజాగా హీరోయిన్ మీరా మిధున్ త్రిషను టార్గెట్ చేస్తూ త్రిషకి కుల పిచ్చి, మత పిచ్చి ఎక్కువ అని, తన లాంటి ఎంతో మంది సినీ తారలను కోలీవుడ్ లో త్రిష కుల ప్రస్తావన తీసుకొచ్చి బలి చేసిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

త‌మిళ బిగ్‌బాస్ సీజ‌న్ 3 షోలో కంటెస్టెంట్‌ గా పాల్గొన్న మీరా మిథున్.. హీరోయిన్ త్రిష తన కెరియర్ ని కావాలని నాశనం చేసిందని, తనని సైడ్ చేయడం వలనే త్రిష సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుందని, ‘ఎన్నై ఇరిందాల్’, రజినీకాంత్ ‘పేట’ చిత్రాలలో తన క్యారెక్టర్ కి సంబంధించిన సన్నివేశాలను తీసి వెయ్యటానికి త్రిషయే కారణమని, అలాగే త్రిష‌కు కోలీవుడ్ మాఫియాతో సంబంధాలున్నాయ‌ని, కోలీవుడ్ లోని నెపోటిజాన్ని త్రిష సపోర్ట్ చేస్తుందని, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన త్రిష త‌న‌కు న‌టిగా అవ‌కాశాలు రాకుండా చేస్తుంద‌ని, ఇందుకు సంబంధించిన ఆధారాలతో త్రిష‌కు సంబంధించిన వీడియో ఒక‌టి త్వరలోనే విడుద‌ల చేస్తాన‌ని మీరా మిథున్ తన ట్విట్ట‌ర్‌ ఖాతాలో ట్వీట్ చేయడంతో ఇప్పుడు వీళ్ళిద్దరి వివాదం హాట్ టాపిక్‌ గా మారి సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here