మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ప్రధమ స్ధానంలో వుండే సినీ సెలబ్రిటీలలో టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ తర్వాత స్ధానం బుల్లితెర యాంకర్ ప్రదీప్ దేనని చెప్పవచ్చు. ఎందుకంటే.. బుల్లితెరపై ప్రదీప్ చేసే ప్రతి షోలోనూ ప్రదీప్ పెళ్లి టాపిక్ రాకుండా ఆ కార్యక్రమం ముగుస్తుందంటే అతి అభద్ధమే.. ఈవిధంగా యాంకర్ గా తాను చేసే కార్యక్రమాల్లోనే కాకుండా ఇతర కార్యక్రమాలకు అతిధిగా వెళ్లినాసరే అక్కడ కూడా ప్రదీప్ పెళ్లిపై జోక్‌లు, పంచ్ లూ పేలుతూనే ఉంటాయనడం అతిశయోక్తి కాదేమో.. ఇక అసలు విషయానికి వస్తే..

తాజాగా యాంకర్ సుమతో కలిసి “అలీతో సరదాగా” అనే షోకి అతిథిగా వెళ్లిన ప్రదీప్‌కి ‘పెళ్లి చూపులు’ గొడవ మళ్ళీ మొదలైంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ క్రమంలో ఈమధ్యనే ఈటీవీలో ‘అలీతో సరదాగా’ షో మళ్ళీ ప్రారంభమైంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోలో భాగంగా యాంకరింగ్ కుటుంబానికి శివగామిగా సుమను పరిచయం చేశారు యాంకర్ ప్రదీప్. ఇక ఈషోలో కూడా అందరూ ఊహించినట్లే ప్రదీప్ పెళ్లిపై పంచ్‌లు పేలాయి. ‘ఈ లాక్ డౌన్‌ సమయంలో మీకేమైనా పెళ్లి చూపులు జరిగాయా?’ అని అలీ అడగ్గా.. ‘ఏం లేదు సార్.. ఒక్కసారి జరిగినందుకే లాక్ డౌన్.. అయ్యింది సార్’!! అని ప్రదీప్ నవ్వుతూ చెప్పడంతో సుమ కూడా పెద్దగా నవ్వేసింది. అంటే సుమ సారధ్యంలోనే కదా నీకు పెళ్లి చూపులు జరిగాయి.? అంటూ అలీ మళ్ళీ అడగ్గానే ‘వద్దు సార్!! అతని పెళ్లి నా చావుకి వచ్చింది’ అంటూ ఫన్నీగా తల పట్టుకుంది యాంకర్ సుమ.

ఇక ఈ పెళ్లి చూపులు గొడవేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తే.. గతంలో సుమ-ప్రదీప్ జంటగా జీ తెలుగులో పెళ్లి చూపులు అనే షో కి యాంకరింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ షో అంతగా పాపులరవ్వడానికి గల కారణమేమిటి అంటే.. జీ తెలుగులో ప్రసారమైన ఈ షో లో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరి అనే అమ్మాయిని ప్రదీప్ రియల్ గానే పెళ్లి చేసుకోబోతున్నాడనే గాసిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే ఆ షో ముగిసిన తర్వాత అదంతా ఉత్తుత్తి పెళ్లి చూపులేనని తేల్చేయడంతో రియల్ లైఫ్ లో పెళ్లి చూపులు సమస్య నుంచి తప్పుకున్నారు ప్రదీప్. దీంతో ఆ షో అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అదండి సంగతి.. చదివారుగా ప్రదీప్ పెళ్ళి వార్తను వినడం కోసం ఎంతమంది ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారో.. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి రావడమంటే ఇదే మరి.!! ఇంతకీ ఈ లాక్ డౌన్ తర్వాతైనా ప్రదీప్ హీరోగా నటించిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?” మూవీ విడుదలయ్యాకైనా ప్రదీప్ పెళ్ళి పీటలెక్కుతాడేమో చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here