బాలీవుడ్ సినీ ప్రపంచం మరో సంచలనానికి నాంది పలుకుతూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి రియా చక్రవర్తి అరెస్ట్ కానుంది. సుశాంత్ సింగ్ మరణం వివాదంలో అనేక మందిని ఎంక్వైరీ చేసిన పోలీసులు ఈమధ్య రియా చక్రవర్తిని కూడా చాలాసార్లు పోలీసులు స్టేషన్ కి పిలిపించి ఇంటరాగేట్ చేయడం జరిగింది. సుశాంత్ సింగ్ బలవాన్మరణంకి ముందు రోజు రాత్రి ఆమెకు సుశాంత్ చాలాసార్లు.ఫోన్ చేసినట్లు ఆధారాలు లభించాయి. దాంతో సుశాంత్ సింగ్ బలవాన్మరణంకు రియాకు ఏమైనా సంబంధం ఉందా.? అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. అయితే సుశాంత్ తండ్రి కొన్ని బలమైన ఆధారాలతో ఆమెపై బీహార్ లో కేసు నమోదు చేశారు.

దీనితో బీహార్ పోలీసులు ముంబైలో దిగి కొన్ని క్రైమ్ సెక్షన్స్ క్రింద రియాపై కేసు నమోదు చేశారు. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేయడం తప్పదంటున్నారు. ఇదిలా వుండగా.. ఈ కేసు విషయమై ఇప్పటికే రియా తన పర్సనల్ లాయర్ ని సంప్రదించారని తెలిసింది. దీంతో తాజా పరిణామాలను గమనిస్తుంటే.. సుశాంత్ కేసులో నిజంగానే ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానాలు అటు బాలీవుడ్ ప్రముఖులకు, ఇటు నెటిజన్లందరికీ కలుగుతున్నాయి. పోలీసు దర్యాప్తులో ఏం తేలుతుందో ఫలితం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here