దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసు దర్యాప్తులో వుంది. రియా చక్రవర్తి తన కొడుకు డబ్బు, నగలను తీసుకుని పారిపోయిందని.. అతడిని మానసిక ఒత్తిడికి గురిచేసి రియాయే సుశాంత్ బలవన్మరణం చేసుకోవడానికి కారణమైందంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా బీహార్ పోలీసులు పోలీసులు FIR నమోదు చేశారు.

ఈ దర్యాప్తులో భాగంగా ఆమె కోసం బిహార్ రాజధాని పాట్నా నుంచి పోలీసుల బృందం ముంబై వెళ్లి ఆమెపై FIRను నమోదు చేసినట్లు పాట్నా సెంట్రల్ జోన్ ఐజీ సంజయ్ సింగ్ తెలియజేశారు. అయితే సుశాంత్ సింగ్ మరణ వివాదంపై సీబీఐ విచారణ చేయించాలని రియా ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కోరింది. సుశాంత్ సింగ్ ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లో గత నెల 14న ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఆయన మరణానికి బాలీవుడ్ లోని నెపోటిజమే కారణమంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే బీహార్ నుంచి వచ్చిన పోలీసు టీమ్ సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తును ప్రారంభించింది. గత 4 రోజులుగా ముంబైలో పాట్నా పోలీసు టీమ్ చేస్తున్న విచారణ ఆసక్తికరంగా కొనసాగుతుంది. ముఖ్యంగా తమ ట్రాన్స్‌పోర్ట్ కోసం పాట్నా పోలీసులు వాడుతున్న వాహనాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముంబై పోలీసుల నుంచి బీహార్ పోలీసులకు ఈ విషయంలో పెద్దగా హెల్ప్ అందడం లేదు.

దాంతో పాట్నా పోలీసులే టీములుగా ఏర్పడి తమకు నచ్చిన వెహికిల్స్ తీసుకుని విచారిస్తున్నారు. BMW, జాగ్వార్ నుంచి ఆటో రిక్షాలు, బైక్‌ల వరకు అన్ని వాహనాల్లో ప్రయాణిస్తోంది పాట్నా పోలీస్ టీమ్. లగ్జరీ కారులలో పాట్నా పోలీసులు ప్రయాణిస్తున్న విజువల్స్ ఆన్‌లైన్‌ తో పాటు కొన్ని టీవీ ఛానెళ్లల్స్ లో వైరలవుతున్నాయి. ఒకరోజు కారు కాదని ఆటోలో కేసు దర్యాప్తుకు బయల్దేరారు. అదే రోజు సాయంత్రం జాగ్వార్‌ లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖండే ఇంటికెళ్లారు. అంతకన్నా ముందు రోజు ఒక సీనియర్ అధికారిని కలవడానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి పాట్నా పోలీసులు బైక్స్‌ పై వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సుశాంత్ కేసును విచారణ చేస్తున్న పాట్నా పోలీసుల ఎంక్వైరీ స్టైల్ నెటిజన్లందర్నీ ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here