ప్రభాస్ సరసన వర్షం సినిమాతో తెలుగునాట అడుగుపెట్టి ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తార త్రిష. తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు లేవుగాని.. తమిళంలో ఈ అమ్మడుకి డిమాండ్ బాగానే ఉంది వరుస విజయాలతో దూసుకుపోతుంది. లేటు వయస్సులో కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. త్రిష కు వివాదాలు కొత్తేమీకాదు కానీ… ప్రస్తుతం ఒక వివాదం ఈ అమ్మడుకి తలబొప్పికట్టేలా ఉంది. అసలు విషయానికి వస్తే… తమిళ చిత్ర నిర్మాతలు ఈ అమ్మడుపై చాలా గుర్రుగా ఉన్నారట.

ఏడాదిగా వాయిదా పడుతూ వస్తున్న సినిమా ప్రమోషన్ విషయంలో ఆమెపై అక్కడి నిర్మాతలు భగ్గుమంటున్నారు. ఆమె పద్దతి సరిగా లేదని బాహాటంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో “పరమపదం విలయట్టు” అనే చిత్రం ఒక సంవత్సర కాలంగా విడుదలకు నోచుకోకుండా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ ఫ్రిబ్రవరి 28 న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకుని ప్రమోషన్స్ ప్రారంభించారు. ఫిబ్రవరి 22వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నై లోని సత్యం సినిమాస్ లో ఏర్పాటు చేసారు. త్రిషని ఈ వేడుకకు రావాలని ఆహ్వానాన్ని అందించారు. అయితే కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ వేడుకను ఎగ్గొట్టేసింది.

ఏంటో డబ్బు ఖర్చు పెట్టి ఈ సినిమాని తెరకెక్కించాం. గత సంవత్సర కాలంగా విడుదలకు నోచుకోవడం లేదు. మళ్ళి ఇప్పడు ఎంతో వ్యయప్రయాసలతో విడుదలకు సిద్ధం చేసాము. ఈ సినిమా విడుదల చేయకపోతే నిర్మాత చాలా నష్టపోతాడు.. ఆర్ధికంగా భారీ నష్టాల్లోకి కురుకుపోతామని చిత్ర నిర్మాత, దర్శకుడు తీవ్ర ఆవేదన చెందారు

నిర్మాత టి.శివ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ప్రమోషన్స్ లేకపోతె పెద్ద పెద్ద హీరోల సినిమాలే ఆడటంలేదు.. పరమపదం విలయట్టు సినిమా లేడీ ఓరియెంటెడ్ సినిమా.. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ పోషించిన త్రిష తప్ప మిగిలిన వారంతా కొత్తవారే అవడంతో.. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ప్రమోషన్స్ కు రాకుండా పోవడం న్యాయమేనా అంటూ అసహనం వ్యక్తం చేసారు. మాది న్యాయ పరమైన కోరిక. ఒకవేళ ఆమె ప్రమోషన్స్ కు రాకపోతే ఆమె పారితోషకాన్ని కట్ చేస్తాం అని నిర్మాత శివ హెచ్చరించారు.

పరమపదం నిర్మాత సురేష్ కమాచి మాట్లాడుతూ తాము నటించిన సినిమాల ప్రమోషన్స్ కు హాజరుకావాలనేది రిక్వెస్ట్ మాత్రమే.. మీరు ఎంత స్టార్ యాక్టర్లు అయితే మాత్రం మీడియాను, ఫ్యాన్స్ ను కలవరా ? ఎంత పెద్ద స్టార్ అయినా నిర్మాతల పరిస్థితి అర్ధం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here