సొట్ట బుగ్గల సుందరి తాప్సి “ఝుమ్మంది నాదం” చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.! టాలీవుడ్ లో సక్సెస్ గ్రాఫ్ తక్కువ ఉన్నప్పటికీ తాప్సికి మంచి గుర్తింపే వచ్చింది. కానీ తెలుగు చలన చిత్రసీమలో తన ప్రతిభకు సరైన గుర్తింపు రాకపోవడంతో స్టార్ హీరోయిన్ గా ఎదగడం కోసం తాప్సి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఈమధ్య కాలంలో ఆమె నటించిన కొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఇక ప్రస్తుత విషయానికొస్తే..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తర్వాత అధికారులు పంపిస్తున్న కరెంట్ బిల్లులు సామాన్య ప్రజానికానికే కాదు.. సినీ రంగ ప్రముఖలకు కూడా షాక్‌ ఇచ్ఛేవిధంగా వున్నాయి. ఏడాది పాటు కరెంటు వాడినా రాని బిల్లు ఒక్క నెలలోనే వచ్చేసరికి సామాన్య ప్రజల ఇళ్ళల్లో కరెంట్ స్విచ్ వేయాలంటేనే భయపడుతున్నారు. ఈ సందర్భంగా సామాన్యులు సైతం ప్రభుత్వాలకు, విద్యుత్ అధికారులకు కరెంట్ బిల్లులపై కంప్లైంట్ చేస్తున్నారు.ఇదిలా వుండగా తాజాగా టాలీవుడ్ హీరోయిన్‌ తాప్సీకి ఏకంగా రూ. 36,000 ల కరెంట్ బిల్లు వచ్చింది. మెట్రో సిటీలోనే నెం.1 గా వున్న ముంబై లోని తాప్సీ‌ ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. ఈమధ్య కాలంలో లాక్‌డౌన్ కారణంగా గత 3 నెలలుగా బిల్లు తీయకుండా డైరెక్ట్ గా బిల్లు పంపించారు. అయితే సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కన్నా జూన్‌ లో దాదాపు 10 రెట్లు కరెంట్ బిల్లు ఎక్కువ రావడంతో తాప్సీ షాక్‌కు గురైంది.

వెంటనే సోషల్ మీడియా లోని ట్వీట్టర్‌ ఖాతాలో కరెంట్ బిల్లులపై తన ఆవేదనను తెలియ పరిచింది. నెల మొత్తమ్మీద వారానికో, రోజుకోక్కసారో వెళ్లి వచ్చే ఇంటికి ఇంత పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు రావడం ఏంటి.? అని హాస్యస్పదంగా తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. తాప్సీ షేర్ చేసిన ట్వీట్‌కి స్పందించిన ఎల‌క్ట్రిసిటీ అధికారులు వెంట‌నే న్యాయబద్ధంగానే ఆ బిల్లు పంపించామని బదులిచ్చారు. అయితే ఎల‌క్ట్రిసిటీ అధికారుల క్విక్ రెస్పాన్స్‌కి షాకైన తాప్సీ లింక్‌లో ప‌ర్మీష‌న్ ఇవ్వ‌లేద‌ంటూనే.. ఇందులో ఏదో మ‌త‌ల‌బు ఉందంటూ సంచలనమైన కామెంట్స్ చేస్తూ.. త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చింది. అదండి అసలు సంగతి.. సినీ సెలబ్రీటీలు సైతం కరెంట్ బిల్లులకు షాకవుతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో మీరే ఆలోచించండి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here