దగ్గుబాటి రాజా… ఈతరం సినీ ప్రేక్షకులకి ఈయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కాకపోతే 1980 – 90 దశకంలో ఈయన తెలుగు, తమిళ్ సినిమాలలో హీరోగా నటించిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. దగ్గుబాటి రాజా అంటే ఎవరో కాదు… టాలీవుడ్ దిగ్గజం దర్శకుడు అయినా దగ్గుబాటి రామానాయుడు అన్న కొడుకు. ఈయన 1981 వ సంవత్సరంలో తమిళ్ సినిమా ” పక్కు వేతాలాయ్ ” సినిమాతో తన సినీ రంగ ప్రవేశం మొదలుపెట్టారు. ఈయన తన నట జీవితానికి గురువుగా దర్శకుడు భారతీ రాజా ను చెప్పుకుంటాడు.

కొన్ని నాళ్ళు ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. ఆ తర్వాత 1987వ సంవత్సరంలో తెలుగులో వైదేహి అనే చిత్రం ద్వారా ఆయన సినిమా హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఝాన్సీ రాణి, సంకెళ్లు, చిన్నారి స్నేహం, ఏడుకొండలస్వామి ఇలా పలు తెలుగు సినిమాల్లో ఆయన హీరోగా నటించడం జరిగింది. ఈయన నిజానికి తెలుగు సినిమాల కంటే తమిళ సినిమాలు అత్యధికంగా చేశారు. అక్కడ కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. గత సంవత్సరం రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో కూడా ఆయన ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది. అప్పట్లో ఈయనకు మహిళ ప్రేక్షకుల ఆదరణ చాలా ఎక్కువగా ఉండేది.

ఇక ఆ తర్వాత ఆయన తన సినిమా అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో ఆయన వారి కుటుంబ వారసత్వం చెందిన గ్రానైట్ వ్యాపారంలో తన తండ్రి దగ్గరే కొనసాగుతూ, ఇప్పటికీ అదే వ్యాపారాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. దగ్గుబాటి రాజాకు ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈయన తన వాణిజ్య కార్యకలాపాలను చెన్నైలో ఉంటూ కొనసాగిస్తున్నారు. ఇక ఈయనకు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. వారందరూ కూడా చెన్నైలోని ఉంటూ వారి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దగ్గుబాటి రాజా కు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. తాను ఇప్పటికి కూడా హైదరాబాదులో దగ్గుపాటి ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ లాంటివి ఏదైనా జరిగినప్పుడు కలుస్తూనే ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here