గత కొద్దీ రోజులుగా మన దేశంలోని సినీ పరిశ్రమల్లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా టాలీవుడ్ దర్శకుడు, జక్కన్న రాజమౌళికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే…ఇక ఈ మహమ్మారి నుంచి బిగ్ బి ఫ్యామిలీ మెంబర్స్ కోలుకున్నారు కానీ అయన మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి తాజాగా జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు అయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు.

”నేను, నా కుటుంబసభ్యులు గత కొద్దిరోజుల క్రితం జ్వరంతో బాధపడ్డాం. అది తగ్గిపోయింది కానీ కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అయితే స్వల్ప లక్షణాలతో కూడిన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేము అందరం హోం క్వారంటైన్‌లో ఉన్నాం. అందరు బాగానే ఉన్నాం… అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శరీరంలో యాంటీబాడీస్ ఏర్పడాలని చూస్తున్నాం. ఆ తర్వాత ప్లాస్మా దానం చేస్తాం” అని రాజమౌళి ట్వీట్‌ ద్వారా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here