టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అటు వెండితెరపై.. జబర్దస్త్ జడ్జిగా ఇటు బుల్లితెర పై రోజాకున్న క్రేజ్ ను గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈరోజున రోజా ఇంత స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం ఎవరని ప్రశ్నించుకుంటే ఒకప్పుడు అగ్ర హీరోల సరసన రోజాకు ధీటుగా నటిస్తూ పోటీగా నిలిచిన మరో స్టార్ హీరోయిన్ అంటే ఇదేదో సినిమా ట్విస్ట్ లా వుంది కదూ..! కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వివరాల్లోకి వెళితే..

ఈమధ్య ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ సినీ కథా రచయత, దర్శకుడు, నటుడు ఈ ఇంటర్వ్యూలో టాలీవుడ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆ అంశాలలోని ముఖ్యాంశమే రోజా టాపిక్. టాలీవుడ్ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన “ప్రేమ తపస్సు” చిత్రం ద్వారా రోజా కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే.! కానీ ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో పాపం రోజా ఛాన్సులు లేక ఖాళీగా ఉండేది. సరిగ్గా అదే సమయంలో పరుచూరి బ్రదర్స్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో శోభన్ బాబు కూతురుగా ముందు మీనాను అనుకున్నారు. కానీ అప్పటికే మీనా.. ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమా సక్సెస్ తో మంచి క్రేజ్ లో ఉంది. “సర్పయాగం” సినిమాలోనేమో హీరో కూతురు చనిపోయే పాత్ర. మరి అలాంటి పాత్రను అప్పటికే హీరోయిన్‌గా మంచి ఫామ్ లో వున్న మీనాతో చేయిస్తే.. ప్రేక్షకాదరణ అంతగా వుండదనే సందేహాంతో పరుచూరి బ్రదర్స్ ఆ పాత్రను కొత్త నటీతో చేయిస్తే బాగుంటుందని రామానాయుడు గారితో చెప్పారట. అదే సమయంలో మాజీ ఎంపీ, నటుడైన శివప్రసాద్ కూడా తాను దర్శకత్వం వహించిన “ప్రేమ తపస్సు” సినిమాను చూడమని చెప్పారట. వాళ్ళ సూచనల మేరకు “ప్రేమ తపస్సు” మూవీని చూసిన రామా నాయుడు గారు రోజా నటనకు ఫిదా అయిపోవడంతో వెంటనే పరుచూరి బ్రదర్స్ ‘సర్పయాగం’ చిత్రంలో శోభన్ బాబు కూతురుగా నటించడానికి రోజాను తీసుకున్నారు. “సర్పయాగం” విడుదలైన కొద్దిరోజులకే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం..

ఆ తర్వాత రోజా స్టార్ హీరోయిన్‌గా ఎలా ఎదిగిందో అందరికీ తెలిసిందే.! అదండి సంగతి.. టాలీవుడ్ నటి రోజా స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం ఎవరంటే రోజాకు ధీటుగా నటిస్తూ పోటీగా నిలిచిన మరో స్టార్ హీరోయిన్ మీనాయేనని ఇప్పుడైనా ఒప్పుకుంటారా.?! టాలీవుడ్ లో వున్న గమ్మత్తేమిటంటే.. ఒక హీరోయిన్ వదులుకున్న పాత్ర స్ధానంలో మరొక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళ అదృష్టం అందలమెక్కుతుందన్న సత్యం ఇలాంటి ఎన్నో సంఘటనల ద్వారా ఋజువైంది. ఇక మీనా, రోజాల విషయానికొస్తే.. వీళ్లిద్దరు కలిసి ‘ముఠామేస్త్రీ’, ‘ బొబ్బిలి సింహం’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో కలిసి నటించారు. ఆ తర్వాత వీళ్లిద్దరు టాలీవుడ్, కోలీవుడ్‌ లోనూ హీరోయిన్స్‌ గా రాణించారు. సినిమా అవకాశాల దగ్గర కూడా ఒకరితో ఒకరు పోటీ పడ్డ సందర్భాలనేకం వున్నాయి. టాలీవుడ్ మాయ అంటే అదే మరి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here