టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శృతి హాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘కాటమ రాయుడు’ చిత్రం తర్వాత తెలుగు సినిమాలలో నటించడం తగ్గించేసింది. ఈమధ్య శృతి హాసన్ నటించిన చిత్రాలు వరుసగా ప్లాపవడంతో ఈ భామకు ఇటు తెలుగులో కానీ, అటూ తమిళ్‌లోగానీ సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.

ఇదిలావుండగా శృతి గతంలో లండన్‌ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌ తో కొంత కాలంగా డేటింగ్‌ చేసి.. ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా శృతిని బాగా కృంగదీసాయని టాలీవుడ్ టాక్. అప్పట్నుంచి కొన్ని సినిమా ఛాన్స్ లు వస్తున్నా రిజెక్ట్ చేసిందని తెలిసింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కొనసాగుండటంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న శృతి తాజాగా సోషల్ మీడియాలో తనకు సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే.. శృతి తన సినిమా కెరీర్ ను మొదలు పెట్టిన క్రొత్తలోనే తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

ఈ అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలవ్వడంతో తను అప్పట్లో ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందో తెలియజేసింది శృతిహాసన్. “నా మొదటి సినిమా షూటింగ్ టైమ్ లోనే నా ముక్కు విరిగింది. అది చూడ్డానికి అంత బాగుండేది కాదు. దానిపై అప్పట్లో నేను చాలా విమర్శలను ఎదుర్కోవల్సి వచ్చింది. నా ముఖం చాలా వెస్ట్రన్ గా ఉందని, చాలా షార్ప్ గా ఉందని, నా ముక్కు వల్ల నేను మగాడిలా కనిపించేదాన్నని ఇలా చాలా కామెంట్స్ వస్తుండేవి. ఆ విమర్శలకు ఒక్కోసారి నేను డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత ఇక తప్పదని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదని ఎవరైనా అంటే అది పచ్చి అబద్ధం. ఎందుకంటే మనుషుల ముఖాలు అంత ఈజీ మారిపోవు.

అయితే నా దృష్టిలో ప్లాస్టిక్ సర్జరీ అనేది పెద్ద విషయమేమీ కాదు. జుట్టుకు కలర్ వేసుకోవడం, కళ్లకు బ్లూ కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోవడం, చర్మానికి బ్లీచింగ్ ఎలాంటివో.. ఈ సర్జరీ కూడా అలాంటిదే. కాకపోతే సినిమా రంగంలో ఉన్నందువల్లన నాలాంటి సెలెబ్రిటీలపై ఎక్కువమంది ఫోకస్ పెడతారే తప్ప ఇందులో ఎవరి తప్పు లేదు. పైగా ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని ఎప్పుడూ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఈ విషయాన్ని గతంలో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మరోసారి సినిమా రంగంలో బాడీ షేమింగ్, బాలీవుడ్ లో బ్యూటీ స్టాండర్డ్స్ పై చర్చ నడుస్తోంది కాబట్టి చెబుతున్నాను” అంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా స్ట్రాంగ్ గా చెప్పేసింది శృతిహాసన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here