రీమేక్‌ సినిమాలన్నవి ఏ ఇండస్ట్రీ లోనైనా సాధారణమే. కథ నచ్చితే రీమేక్ చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తిని చూపిస్తుంటారు. నాటి తరం హీరోలైన NTR, ANR, కృష్ణ.. మధ్యతరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు కూడా ఎన్నో రీమేక్‌ చిత్రాలలో నటించారు.

ఇక నేటి తరం టాప్ హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, రామ్, నాగ చైతన్య‌లు కూడా రీమేక్ చిత్రాల్లో నటించారు. అయితే సూపర్‌ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ లు మాత్రం ఇంతవరకూ రీమేక్‌ చిత్రాలలో నటించలేదు. మహేష్ బాబు ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ మూవీ లోనూ.. అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలోనూ నటిస్తుండగా.. వీరిద్దరి కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క రీమేక్ కూడా లేకపోవడం విశేషం. ఇక వీళ్ళిద్దర్నీ పక్కన పెడితే ఇంతవరకూ రీమేక్‌ చిత్రాలలో నటించకుండా వున్న మన టాలీవుడ్ హీరోలు ఎవరెవరో మీరే తెలుసుకోండి..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా నటించిన ‘నాని’ చిత్రం అందరూ రీమేక్ అనుకుంటారు. కానీ., ఆది ద్విభాషా చిత్రం అన్న సంగతి చాలామందికి తెలియదు. అలాగే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి రీమేక్స్ చిత్రాలలో నటించే ఇంట్రెస్ట్ లేదని చాలా ఇంటర్వ్యూల్లో తెలియజేశాడు.

అల్లు అర్జున్

వాస్తవానికి ‘ధృవ’ చిత్రంలో బన్నీ నటించాల్సింది. కాని అనివార్య కారణాల వలన ఆ రీమేక్ చిత్రం రామ్ చరణ్ దగ్గరకి వెళ్ళింది.

టాలీవుడ్ భల్లాల దేవ రానా

‘నా ఇష్టం’ నుండి ‘విరాట పర్వం’ వరకు రానా ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమాలు అన్నీ స్ట్రెయిట్ చిత్రాలే.. కాకపోతే ఆమధ్య మలయాళ రీమేక్ అయిన ‘బెంగుళూర్ డేస్’ చిత్రం తమిళ వెర్షన్ లో నటించాడు. కాని ఆది తమిళ చిత్రమే కానీ తెలుగులో విడుదల కాలేదు.

సాయి ధరం తేజ్

యంగ్ మెగా హీరో సాయి ధరం తేజ్ కి ఆమధ్య కొన్ని ఫ్లాప్స్ వచ్చినా స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతోనే హిట్ లను సాధించాడు. కాని రీమేక్ ల జోలికి ఎప్పుడూ పోలేదు.

విజయ్ దేవరకొండ

‘పెళ్ళి చూపులు’ చిత్రం నుండి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం వరకు విభిన్న కథలతో హిట్స్ & డిజాస్టర్స్ వచ్చినా విజయ్ తన కెరీర్ లో ఇంకా రీమేక్స్ జోలికి వెళ్ళలేదు.

నితిన్

నితిన్ ఆమధ్య వరుస ఫ్లాపులతో కెరీర్ దాదాపు క్లోజ్ అయ్యే స్టేజ్ లో ఉన్నా ఎప్పుడు రీమేక్స్ చేయలేదు.

మంచు విష్ణు

కంటెంట్ మూవీస్ తో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన మంచు విష్ణు కూడా ఇప్పటి వరకు రీమేక్స్ చిత్రాలలో నటించలేదు.

అఖిల్ అక్కినేని

ఇంతవరకూ నటించింది 3 చిత్రాలే అయినా.. అఖిల్ ఇంతవరకూ రీమేక్ చిత్రాలలో నటించే ప్రయత్నమే చేయలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here