త్వరలోనే అక్కినేని వారి ఇంట పెళ్లిబాజాలు – పెళ్లి కొడుకు కాబోతున్న అఖిల్ !!

0
557

‘సిసింద్రీ” చిత్రం ద్వారా బాలనటుడిగా వెండి తెర మీదిపై బోసినవ్వులతో మురిపించిన అక్కినేని వారసుడు అఖిల్ “మనం” చిత్రంలో యంగ్ లుక్ తో అతిధి పాత్రలో తళుక్కున మెరిశాడు. కథ దగ్గర్నుంచి దర్శకుడి వరకూ అన్నీ తన ఇష్ట ప్రకారమే కానిస్తూ.. వీర మాస్ హీరోగా సెటిలైపోవాలని అనుకున్నఅఖిల్ హీరోగా అఖిల్, హలో, మిస్టర్ మజ్నువంటి చిత్రాలలో నటించినా అవి బాక్సాపీస్ దగ్గర బోల్తా పడటంతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో కాస్త వెనక్కి తగ్గిన అఖిల్ లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్నో లెక్కలు వేసుకుని, పెద్దవాళ్ళ క్లాసులు విన్న తర్వాత లేటెస్ట్ గా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..

అఖిల్ పెళ్లి కొడుకు కాబోతున్నాడని తాజా సమాచారం. కరోనా లాక్ డౌన్ టైం లోనే టాలీవుడ్ లో సినీ ప్రముఖులు పెళ్లిళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో త్వరలోనే అక్కినేనివారి ఇంట పెళ్లిబాజాలు మోగబోతున్నాయి. అఖిల్ అక్కినేని పెళ్లి ఫిక్స్ అయిపోయిందని, ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడనే రూమర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే అఖిల్ పెళ్లి బాధ్యతలను.. వదిన సమంత తీసుకుందట. ఆమె దగ్గరుండి అఖిల్ పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేస్తుందట. దీనికి సంబందించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

సోషల్ మీడియాలో ఈ రూమర్స్ విన్న టాలీవుడ్ ప్రాముఖ్గులు కొందరు “కెరీర్లో ఇంకా ఒక అడుగు కూడా వేయలేదు అప్పుడే పెళ్లి దాకా వెళ్లిపోయాడే.. ఎందుకిప్పుడే పెళ్లి. అయినా నాగార్జున వాళ్ల ప్రేమని ఒప్పుకుని పెళ్లి చేస్తానన్నాడు కదా.. మరెందుకీ తొందర.?” అనుకుని ముక్కున వేలేసుకున్నారు. కొందరైతే సినిమా వాళ్లకి జాతకాలంటే ఎక్కువ నమ్మకం కాబట్టి అఖిల్ జాతకంలో కూడా పెళ్ళైతే దశ తిరుగుతుందేమోనన్న అంశం ఉందేమోనని, అందుకే అఖిల్ పెళ్లికి తొందరపడుతున్నాడు కాబోలు అనుకుంటున్నారు. మరి ఈ మాట ఎంతవరకూ నిజమన్నది అఖిల్ చెప్పాలి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here