కరోనా పుణ్యమాని టాలీవుడ్ లో షూటింగ్‌ లు లేవు. డబ్బింగ్‌లు లేవు. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లు లేవు. సక్సెస్‌ మీట్లూ లేవు. ఫ్యాన్స్ తో ఈ దూరం అస్సలు మంచిది కాదేమో అన్న సందేహం వచ్చిందేమో.. వెంటనే సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్‌గా దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు సినీ తారలు. ఫ్యాన్స్‌తో ముచ్చటించడంతో పాటు కోవిడ్‌ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అలాగే ఎంతో మంది తారలు తమ కుటుంబాలతో గడిపిన మధుర క్షణాలను కూడా ట్విట్టర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు.  ఇక అసలు విషయానికి వస్తే..

సినిమా రంగంలోకి అడుగు పెట్టిన క్రొత్తలో ‘R.J’ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు మన నేచురల్ స్టార్ నాని. ‘రాధా గోపాలం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఫన్నీగా తన తనదైన కామెడీ స్టైల్ లో ప్రేక్షకులందర్నీ అలరించిన నాని ఆ తర్వాత ‘రైడ్’ ‘స్నేహితుడా’ ‘భీమిలి కబడ్డీ జట్టు’ ‘అలా మొదలైంది’ ‘పిల్ల జమిందార్’ వంటి చిత్రాలలో తన నటనా సామర్థ్యాన్ని చూపించాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు మన నేచురల్ స్టార్ నాని. అయితే ‘ఈగ’ చిత్రం తర్వాత ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ ‘పైసా’ ‘ఆహా కళ్యాణం’ ‘జెండా పై కపిరాజు’ వంటి వరుస ప్లాపులతో టెన్షన్ పడుతున్న నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో మళ్ళీ టాలీవుడ్ సక్సెస్ బరిలోకి దిగాడు. ఈమధ్య వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం నాని కెరీర్లో ఓ మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో నాని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో పాటు ‘నేచురల్ స్టార్’ అనే బిరుదుని కూడా తన సొంతం చేసుకున్నాడు. నిర్మాతగా ఈమధ్యనే క్రొత్త అవతారమెత్తి ‘అ!’ అనే చిత్రాన్ని కూడా రూపొందించి తొలి చిత్రంతోనే మంచి టాలెంట్ ఉన్న ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తాజాగా నేచురల్ స్దార్ నాని ఫోటోలు వైరలతున్నాయి. గతంలో చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని ఆమధ్య విడుదలైన ‘రాధా గోపాళం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న టైంలో తీసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ ఫోటోను చూసిన నాని ఫాన్స్ కూడా తమ ఫ్రెండ్స్ కు ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి నాని ‘టక్ జగదీశ్’ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న ‘వి’ మూవీలో నెగెటివ్ షేడ్ పాత్రను చేస్తున్నాడు. మరి వీలైతే మీరు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్న నాని ఫోటోపై ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here