ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్న 15 స్టార్ హీరో బ్రదర్స్ వీళ్ళే !!

0
277

మన భారతదేశ సినీ పరిశ్రమలో ఎంతోమంది నట వారసులు వచ్చి ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో కేవలం తనయులు మాత్రమే కాకుండా అన్నదమ్ములు కూడా సిని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

కేవలం మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా భారతదేశంలో ఉన్న మిగతా ఇండస్ట్రీలో కూడా అన్నదమ్ముల సినీ పరిశ్రమలు వారి తగ్గ స్థాయిని ఏర్పరుచుకున్నారు. అలా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న అన్నదమ్ములు ఎవరో ఓసారి చూద్దామా..

ముందుగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చూస్తే మెగా హీరోలు చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబు గురించి చెబుతారు ఎవరైనా. ఇందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి హీరోగా నటించగా నాగబాబు కారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు.

ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియ చేసిన వ్యక్తిగా సీనియర్ ఎన్టీఆర్ నిలుస్తారు. ఇకపోతే ఈయన వారసత్వం తీసుకున్న కొడుకులు నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ టాలీవుడ్ లో హీరోగా రాణించారు. అయితే ఇది వరకు కాలంలో నందమూరి హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో అనుకోకుండా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో ఓవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఇలా వీరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుపాటి వెంకటేష్ లు కొనసాగుతున్నారు. ఇందులో దగ్గుబాటి సురేష్ సురేష్ ప్రొడక్షన్ సంబంధించిన పనులు చేసుకుంటుండగా హీరో వెంకటేష్ మాత్రం సినిమాల్లో నటిస్తున్నారు.

ఇక ఘట్టమనేని కుటుంబం నుంచి సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా రమేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీ లో రాణించారు. ఇందులో మహేష్ బాబు తన నటనతో స్టార్ ఇమేజ్ సంపాదించగా రమేష్ బాబు మొదట్లో హీరోగా పలు సినిమాల్లో నటించిన ఆ తర్వాత కేవలం సినిమా నిర్మాతగా కొనసాగుతున్నారు.

ఇక వీరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హరికృష్ణ వారసులు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి తర్వాత మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు ఇద్దరు హీరోలు గా కొనసాగిన సంగతి కూడా తెలిసిందే.

అలాగే మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. అందులో ఇప్పటికీ సాయి ధర్మ తేజ్ హీరోగా రాణిస్తుండగా తన సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా త్వరలో ఉప్పెన సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేయబోతున్నాడు.

ఈ మధ్యకాలంలో సెన్సేషన్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ తనతో పాటు తన తమ్ము డు ఆనంద్ దేవరకొండ ను దొరసాని సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

వీరితో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో వరసకు అన్న తమ్ముళ్లు అయ్యేవారు మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తేజ, నాగబాబు కొడుకు వరుణ్ తేజ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు.

అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈవివి సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన హీరో ఆర్యన్ రాజేష్ సోదరుడు అల్లరి నరేష్. ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ సినిమాలలో నటించారు.

వీరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా పరిచయం అవ్వగా త్వరలో శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.

అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఫ్యామిలీ లో మూడో తరంలో హీరోలుగా వచ్చిన అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు.

అలాగే మెగా కాంపౌండ్ నుంచి మరో చెప్పుకోదగ్గ అన్నదమ్ముల హీరోలు ఎవరు అంటే.. అల్లు అర్జున్, అల్లు శిరీష్. వీరిద్దరు కూడా వారి తగ్గ స్థాయికి సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో అగ్ర హీరోలు గా కొనసాగుతున్నారు.

ఇక దగ్గుబాటి రానా నుంచి మూడోతరం హీరోగా రానా దగ్గుబాటి ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ అనేక చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక రానా తమ్ముడు అభిరామ్ సురేష్ ప్రొడక్షన్ సంబంధించిన పనులను చూస్తూ ఉన్నాడు.

ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ ఫ్యామిలీకి చెందిన మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా సినిమాల్లో రాణించిన వారే. వారెవరు అంటే సాయికుమార్, రవిశంకర్. వీరిద్దరి కేవలం నటనతోనే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఎన్నో ఇండస్ట్రీలకు సేవలను అందిస్తున్నారు.

వీరితో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. ఈయన సోదరులైన భరత్, రఘు లు కూడా సినీ పరిశ్రమలో రాణించిన వారే.

అలాగే తెలుగు చిత్ర సీమలో స్టార్ కమెడియన్ గా పేరుపొందిన అలీ సైతం తన తమ్ముడు ఖయ్యుం ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినవారే. అలీ కామెడీ రోల్స్ చేస్తుంటే ఖయ్యుం తనదైన స్టైల్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ ను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇకపోతే ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోగా మిగతా చిత్ర పరిశ్రమలో ఉన్న అన్నదమ్ముల గురించి చూద్దాం. తమిళ సినిమాల్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న సూర్య తన తమ్ముడు కార్తీ ని కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చాడు. వీరిద్దరూ ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

వీరితో పాటు తమిళ ఇండస్ట్రీలో హీరో ధనుష్, డైరెక్టర్ సెల్వరాఘవన్ లు కూడా అన్నదమ్ములే. ఇద్దరు కూడా తమిళ ఇండస్ట్రీలో వారి మంచి పేరు తెచ్చుకున్న వారే.

అలాగే కన్నడ పరిశ్రమకు చెందిన ఇంద్రజిత్ సుకుమారన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా సాగుతున్నారు.

వీరితో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలో చిరంజీవి సర్జా, ధ్రువ సర్జా లు కూడా హీరోలుగా రాణించిన వారే. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి సర్జా గుండెపోటు కారణంగా చిన్న వయసు లోనే మరణించాడు.

వీరితో పాటు జయం రవి, మోహన్ రాజాలు కూడా దక్షిణాది చిత్రసీమలో వారు యాక్టింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నారు.

వీరితోపాటు వెంకట్ ప్రభు, ప్రేమ్ జి అమరన్ అన్నదమ్ములు చిత్రసీమలో బాగా రాణించారు.

ఈ లిస్టులో కన్నడ సూపర్ స్టార్.. రాజ్ కుమార్ అలాగే తన సోదరుడు శివ రాజ్ కుమార్ లు కూడా చేరుతారు. వీరిద్దరూ కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో బాగా రాణిస్తున్నారు.

ఈ లిస్టులో చిట్టచివరగా భారతదేశంలో ఓ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కమల్ హాసన్. ఈయన సోదరుడు చారుహాసన్ కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇలా అన్ని ఇండస్ట్రీలో అన్నదమ్ములు వారికి తగ్గ స్థాయిలో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here