ఉన్నావ్ అత్యాచారం కేసు.. దోషికి జీవిత ఖైదు..

0
408

నిర్భయ ఘటన తర్వాత అదే స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచారం కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. బాలిక కిడ్నాప్‌.. అత్యాచారం.. బాధితురాలి తండ్రి లాకప్‌ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. రెండేళ్లు.. అనూహ్య మలుపులు తర్వాత బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కు జీవిత ఖైదు విధించింది, మరియు బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేసును విచారించిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సిబిఐ వాదనలు పూర్తయిన తర్వాత ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ను ఈ నెల 16న దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పును వెలువరించింది. అత్యాచారం (376) కింద ఆయనను దోషిగా కోర్టు నిర్థారించి ఎట్టకేలకు ఈ కేసులో ఎట్టకేలకు కోర్టు శిక్షను ఖరారు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here