నిజానికి కొందరిని చూస్తే వారు ఎంత ఎత్తు ఎదిగిన అనిగిమనిగి ఉంటారు అని అనిపిస్తుంది మనకి. నిజానికి అలా ఉండే వాళ్లను చాలా తక్కువ చూస్తుంటాము మనం. అందులోనూ ఇక సినీ పరిశ్రమలో ఇలాంటి వాళ్లు చాలా అరుదు అని చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే… కన్నడంలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన జయంతి ఈ కోవకే చెందుతుంది అని చెప్పవచ్చు.

దీనికి కారణం ఒకానొక సమయంలో అంటే ఈమె తొలినాళ్లలో ఒక తమిళ షూటింగ్ జరుగుతున్న సమయంలో జయంతి, మహానటి సావిత్రి కలిసి ఒక సినిమాలో కలిసి నటించాల్సి వచ్చింది. అయితే అప్పటికి జయంతి గారికి తమిళ్ సరిగా రాదు. ఆ సమయంలో నటి సావిత్రి అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే ఆ సినిమా షూటింగ్ లో జయంతి గారు ఒక పెద్ద డైలాగ్ చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇక ఆ సమయంలో జయంతి తమిళంలో ఆ డైలాగ్ చెప్పడానికి చాలా ఇబ్బందులు పడింది. దీనితో ఆ సినిమా యూనిట్ అనేక షాట్స్ ను తీయాల్సి వచ్చింది. దీనితో అక్కడే ఉన్న నటి సావిత్రి గారికి తీవ్ర కోపం వచ్చి ఆ సినిమా దర్శక నిర్మాతలకు డైలాగ్ చెప్పడానికి రాని వారిని తీసుకువచ్చి మమ్మల్ని ఇలా ఇబ్బంది ఎందుకు పెడతారు అని చివాట్లు పెట్టింది. ఇక దానితో నటి జయంతి గారు ఆ విషయం నొచ్చుకొని తన మేకప్ రూమ్ లోకి వెళ్లి బోరున ఏడ్చుకుంటూ… ఆ సినిమా నిర్మాతకు నేను ఈ సినిమాలో నటించను, నావల్ల మీరు ఏదైనా నష్టం వాటిల్లితే కనుక దానికి సంబంధించిన డబ్బులు మీకు ఇస్తాను అంటూ ఆ సినిమా నుంచి తప్పుకుంది నటి జయంతి.

అయితే కొన్ని రోజుల తర్వాత ఆసమయంలో జయంతి కన్నడ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఆ సినిమాలో నటి సావిత్రి గారిని గెస్ట్ రోల్ గా తీసుకోవడం జరిగింది. అయితే ఆ సినిమా కోసం సావిత్రి గారు చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లగా ఆ సినిమా షూటింగ్ లోకి అడుగుపెడుతుండగా నటి జయంతి సావిత్రి గారికి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుంది. అయితే నటి సావిత్రి జయంతిని నువ్వు స్టార్ హీరోయిన్ వి ఇలా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని అనగా… తను ఇంతకు ముందు జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తూ మీరు నన్ను మర్చిపోయారు అని అన్నది జయంతి. అప్పుడు నటి సావిత్రి గారు అవునా నేను అలా చేశాను, నేను అలా చేసినందుకు చాలా బాధపడుతున్నాను అంటూ జయంతితో మాట్లాడారు. ఆ సమయంలో నటి జయంతి సావిత్రి గారితో మాట్లాడుతూ మీరు ఆ రోజు నన్ను అలా అన్నందుకు నేను కష్టపడి తమిళం నేర్చుకొని ఇప్పుడు తమిళ సినిమాల్లో కూడా చేస్తున్నాను అంటూ మహానటి సావిత్రి గారి గురించి తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here