టాలీవుడ్ లో మరో భారీ మల్టీస్టారర్.. బాక్స్ బద్దలవ్వాల్సిందే..?

0
132

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కి ఆ సినిమాల్లో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాలు ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే మరో భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధమవుతోందని అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది.


అల వైకుంఠపురములో సినిమాతో గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గీతా గోవిందం సినిమా తరువాత ఆ స్థాయి సక్సెస్ అందుకోని విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాలో నటిస్తున్నారు. తమ తరువాత సినిమాల ద్వారా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోలుగా ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

యాత్ర సినిమా దర్శకుడు మహేష్ వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడు యాత్ర 2 సినిమాను కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. యాత్ర సినిమాతో హిట్ కొట్టిన మహేష్ వి రాఘవ్ అద్భుతమైన స్క్క్రిప్ట్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అంటే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు శుభవార్త అనే చెప్పాలి.

అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ రగ్గుడ్ లుక్ తో కొత్తగా కనిపించనున్నారు. బన్నీకి జోడీగా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here