కరోనా ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. నానాటికి కరోనా చాలా వేగంగా విస్తరిస్తోంది.. ఇప్పటికే లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడి ఆసుపతులలో చికిత్స పొందుతున్నారు. మరో పక్క వేలాది మంది మృతి చెందుతున్నారు. ఈ కరోనా మహమ్మారి ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరో పక్క కరోనా పెద్దన్న అమెరికాపై విలయతాండవం చేస్తుంది. అమెరికాలో ఈ వైరస్ భారిన పడిన వారి సంఖ్య భారీగా ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య అమెరికాలోనే ఎక్కువగా ఉంది. అంతేకాదు మృతుల సంఖ్యలో కూడా అమెరికా ముందే ఉంది. ఇప్పటికే అమెరికాలో 3,67,650 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా… మృత్యువాత పడిన వారి సంఖ్య 10,943 మంది. అయితే కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ట్రంప్ చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. అయినా ఈ మహమ్మారిని అదుపులోకి రావడం లేదు.

ఈ క్రమంలో ట్రంప్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా కంటికి కనిపించనంత భయంకరమైన శత్రువని, ఇది చాలా శక్తిశాలీ కావొచ్చు. మరియు చాలా తెలివైనది అని చెప్పారు… కానీ అది ఎంతటి తెలివైనది అయినా సరే మేము ఆ కరోనా కంటే తెలివైన చెప్పుకొచ్చారు. అయితే ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు తాము పలు అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. అయితే తాను, మరియు సిబ్బంది ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం కరోనా పరీక్షలకు పెద్దగా సమయం పట్టడం లేదని, చాలా సులభంగా అయిపోతుందని ట్రంప్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here