చైనాలో కరోనా విజృంభిస్తున్న వేళ చైనీయులను అమెరికాలోకి అనుమతించవచ్చు అంటూ డబ్ల్యూహెచ్ఓ తమకు ప్రతిపాదనలు పంపిందని, ఇటువంటి తప్పుడు సహాలాహాలు ఎందుకు ఇచ్చారు అంటూ తీవ్ర స్థాయిలో ట్రంప్ విరుచుకుపడ్డారు. మరో పక్క అమెరికా నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకుంటున్నా కూడా డబ్ల్యూహెచ్ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇకనుంచి డబ్ల్యూహెచ్ఓ కు అమెరికా పంపించే నిధులను ఉపసంహరించుకుంటామని బెదిరించారు ట్రంప్.

అయితే ట్రంప్ చేసినా ఈ వ్యాఖలపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. కరోనా సృష్టిస్తున్న కల్లోలం ఇంకా తగ్గని కారణంగా డబ్ల్యూహెచ్ఓ కు ఇవ్వాల్సిన నిధులను ఆపాలని అనుకోవడం సరికాదని అభిప్రాయపడింది. 2019 లో డబ్ల్యూహెచ్ఓ కు అమెరికా 400 మిలియన్ డాలర్ల కు పైగా నిధులు సమకూర్చింది. అయితే చైనా.. డబ్ల్యూహెచ్ఓకు సమకూర్చిన మొత్తంలో పోలిస్తే ఇది రెండు రేట్లకు పైమాటే.. మరో వైపు డబ్ల్యూహెచ్ఓ చైనాతో కలిసి పనిచేయడం అనేది కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనాపై అవగాహన పెంచేందుకు ఎంతో అవసరమని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ బ్రుస్ ఎలివార్డ్ స్పష్టం చేసారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here