వాట్సప్ యాజమాని జుకర్ బర్గ్ సిగ్నల్ యాప్ వాడకంపై సెటైర్లు.!

0
197

వాట్సప్ యాజమాని సిగ్నల్ యాప్ వాడటం ఏంటి అని ఆలోచిస్తున్నారా? నిజమే ప్రస్తుతం ఈ విషయంపై భారీ చర్చ జరుగుతోంది. దీనిపై మార్క్ జుకేర్ బర్గ్ కు సెటైర్లు కూడా వేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవలే ఫేస్ బుక్ కు సంభందించి భారీ డేటా లీక్ అయినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఫేస్ బుక్ నుంచి లీకైన 533 మిలియన్ల యూజర్ల డేటాలో మార్క్ జుకేర్ బర్గ్ డేటా కూడా ఉన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఆ డేటాలో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఫోన్ నంబర్, పేరు, నివాస స్థలం, వివాహ వివరాలు, పుట్టన తేదీ, FB యూజర్ ఐడీతో సహా సమాచారం మొత్తం లీకైనట్టు తెలిపాయి. అంతేకాదు అయన ఫోన్ నంబర్ ద్వారా జుకర్ బర్గ్ సిగ్నల్ యాప్ వాడుతున్నట్టు వెల్లడైంది. వాట్సాప్ యజమాని సిగ్నల్ యాప్ వాడటంపై రకరకాల చర్చ జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here