అక్కినేని వారసుడు అఖిల్ ‘సైమా అవార్డ్స్-2017 ‘ వేడుకలో స్టేజ్‌పై పాటపాడి ఫిదా చేసేశారు

అక్కినేని వారసుడు అఖిల్ ‘సైమా అవార్డ్స్-2017 ‘ వేడుకలో స్టేజ్‌పై పాటపాడి అక్కడున్న వారందరినీ ఫిదా చేసేశారు. తన తర్వాతి సినిమా ‘హలో’ లోని ‘ఏవేవో కలలుకన్నా.. ఏవైపో కదులుతున్నా..’ అంటూ సాగే పాటను పాడి తనలోని కొత్తకోణాన్ని అందరికీ పరిచయం చేశారు. తొలిసారి లైవ్‌లో పాటను ఆలకించి తన గొంతులోని మాధుర్యం ఏంటో నిరూపించారు.