టెలికాం రంగంలో ఉచిత కాల్స్ డేటా ఆఫర్లతో జియో సంచలనం సృష్టించిన సంగతితెలిసిందే.ప్రత్యర్థి నెట్వర్క్స్ నుండి పోటి ఉండటంతో కస్టమర్లకు మరోసారి దివాళీ ఆఫర్ ప్రకటించింది జియో. ఎయిర్ టెల్ 4G స్మార్ట్ ఫోన్ ప్రకటించిన వెంటనే.. జియో నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం. దీపావళి సందర్భంగా కస్టమర్లకు 100శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య 399 రూపాయల ధన్ ధనా ధన్ ఫ్లాన్ కి రీఛార్జ్ చేసుకుంటే.. అంతే మొత్తానికి ఎనిమిది ఓచర్లను ఇస్తోంది జియో. ఒక్కో ఓచర్ విలువ 50 రూపాయలు. అంటే 400 రూపాయలు విలువైన టాక్ టైం ఇస్తోంది. వీటిని నవంబర్ 15వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైనా వాడుకోవచ్చు.పూర్తీ వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.