అబ్బో… ప్రియాంకా డ్రెస్ మామూలుగా లేదుగా !!

0
305

ప్రియాంక చోప్రా ఇప్పుడు ఈమె “గ్లోబల్ స్టార్”. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరికి సుపరిచితురాలే.. ఈ ముద్దుగుమ్మ ఎం చేసిన సెన్సేషనే.. చేసిన ప్రతి పని ట్రేండింగ్ అవుతోంది. తాజాగా గ్రామీ అవార్డుల ప్రదానోత్సవానికి ఈ అమ్మడు వేసుకున్న డ్రెస్ చూసి అందరు షాక్ అవుతున్నారు. “అందాల ఆరబోత” అంటే సరిపోదేమో… ఎక్సపోజింగ్ కు కొత్త నిర్వచనం చెప్పేలా ఉంది ప్రియాంక చోప్రా ధరించిన డ్రెస్. ఆలా అని ఇదేమి కొత్త స్టైల్ కాదు… పాతదే, గతంలో హాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ తరహా దుస్తులలోనే ఎక్కువగా కనిపించేవారు.

ఆమె కన్నా పదేళ్లు చిన్న వాడు అయిన నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని ఆమె ప్రత్యకతని చాటుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తరువాత వీరిద్దరి ముద్దు ముచ్చట్లు, ఫొటోస్ అన్ని ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకుంటూ తెగ హంగామా చేస్తోంది. నిత్యం ఇంస్టాగ్రామ్ లో యమా యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం అటు హాలీవుడ్ లో, ఇటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ప్రియాంకకి ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. దానికి తగ్గట్టుగానే ప్రియాంక డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది.

తాజాగా గ్రామీ అవార్డ్స్ 2020 కి తన భర్త తో కలిసి తెగ సందడి చేసింది. సిల్వర్ కలర్ డ్రెస్ లో బ్యూటిఫుల్ గా కెమెరాలకు పోజులిచ్చింది. ఈ డ్రెస్ లో ఆమె యధ సంపద చాలా వరకు కనిపిస్తుండటంతో ఆ ఫొటోస్ ఇప్పుడు చాలా ట్రేండింగ్ అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రియాంక డ్రెస్ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండియాను రిప్రజెంట్ చేస్తూ ప్రియాంక ఇలాంటి డ్రెస్సులు చేయడం బాలేదు అంటూ కొందరు ఘాటు వ్యాఖలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం నచ్చిన డ్రెస్ వేసుకునే స్వతంత్రం ఆమెకు ఉంది అంటూ ప్రియాంకకు సప్పోర్ట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here