అలా వైకుంఠపురములో రివ్యూ

0
1364

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఈ రేంజ్ అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషలో వచ్చిన “జులాయి”, “సన్ అఫ్ సత్యమూర్తి” చిత్రాలు ఇచ్చిన హిట్ తాలూకా ప్రభావం ముచ్చటగా మూడోసారి వచ్చిన “ఆలా వైకుంఠపురములో” పై భారీగానే ఉంది. దీనికి తోడు నాలుగు నెలల నుండి ఈ సినిమా పాటలు ఎన్ని రికార్డులు సృష్టించాయో మనము చూస్తునే ఉన్నాము. సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసాయి.

ప్రచారం లో కొత్తపుంతలు తొక్కుతూ మూడు నెలల ముందు నుంచి ప్రేక్షకులను ఆకట్టుకునేలా పబ్లిసిటీ చేయడంతో సినిమాకు భారీగా హైప్ పెరిగింది. ఒక సినిమా హైప్ ఆకాశాన్ని తాకుతుంది అంటే ఆ ప్రభావం రెండవ సినిమా మీద పడుతుంది. సినిమాలో కంటెంట్ బాగుండి, ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ సినిమా ఎక్కడికో వెళ్తుంది. బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాస్తుంది. పొరపాటున సినిమా అంచానాలు అందుకోలేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా చతికిల పడిపోతుంది. ఈ విషయం మన అందరికి తెలిసిందే.. దీనికి ఉదాహారణ లు ఉన్నాయి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “అజ్ఞాతవాసి” నే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

బంటు (అల్లు అర్జున్ ) అంటే మొదటినుండి తన తండి వాల్మీకి (మురళి శర్మ) కి పడదు. తనకి కావాల్సింది ఇవ్వకపోవడం, సరిగా చూసుకోకపోవడం చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఇదే ఫ్రస్ట్రేషన్ లో పెరిగిన బంటు తన బాస్ (పూజ హెగ్డే) ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఇదిలా ఉండగా రామ చంద్ర (జైరాం) తన కొడుకు సుశాంత్ కు పూజ హెగ్డే ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రామ చంద్ర బిజినెస్ పై కన్నేసిన విలన్ (సముద్రఖని) అతనిపై దాడి చేయిస్తాడు. అయితే అది ఇటు తిరిగి, బంటుకి తన జీవితంలో జరిగిన అతి పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. దాంతో జైరాం అండ్ ఫామిలీ ఉంటున్న వైకుంఠపురం (వాళ్ళ ఇల్లు) వెళతాడు బంటు.

అక్కడ ఎదురైనా పరిస్థితులు, అసలు బంటుకి తెలిసిన నిజమేమిటి? ఎందుకని వాళ్ళ నాన్న బంటుని ద్వేషిస్తాడు? చివరికి తన బాస్ తో ప్రేమాయణం ఏమైంది ? ఇలాంటి ప్రశ్నలు అన్నిటికి సమాదానాలు కావాలి అంటే సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే…

అల్లు అర్జున్ ది కెరీర్ లో అన్ని ఎమోషన్స్ కలగలిసిన పాత్ర, కామెడీ పరంగా, ఎమోషన్స్ పరంగా బన్నీ బాగానే మెప్పించాడనే చెప్పాలి. ఫైట్స్ అండ్ డ్యాన్సుల్లో కూడా చాల స్టైలిష్ గా కనిపించడు. పూజ హెగ్డే కు నామ మాత్రపు పాత్రే దక్కిందని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ ను లవ్ చేయడం తప్ప ఆమె చేసింది ఏమి లేదు. సుశాంత్ కు కూడా పెర్ఫార్మెన్స్ కు పెద్దగా స్కోప్ ఏమి లేదు. నివేత పేతురేజ్, టబు కధలో భాగమైన కూడా వాళ్లకు లిమిటెడ్ పాత్రలే దక్కాయి. అయితే మురళీశర్మ మాత్రం ఒక విభిన్నమైన పాత్రలో మెప్పించాడు. మలయాళ నటుడు జైరాం కూడా బాగానే మెప్పించాడు. సెకండ్ హాఫ్ లోని ఎమోషనల్ సీన్స్ లో అతని హావభావాలు బాగుంటాయి. సచిన్ ఖేద్కర్ కు మంచి పాత్ర దక్కింది. అందులో అతని నటన బాగుంది. సునీల్, హర్షవర్ధన్ పెద్దగా చేసిందేం లేదు. మిగతావాళ్ళు మామూలే..

సాంకేతికంగా ఆలా వైకుంఠపురములో చాలా ఉన్నతంగా తెరకెక్కింది. సినిమాటోగ్రఫీ ఒక లెవల్ లో ఉంది. విజువల్స్ చాల బాగున్నాయి. సమజవరాగమనా పాటలో పారిస్ అందాలను, బుట్ట బొమ్మ చిత్రంలో అందమైన సెట్ ను చూపించిన విధానం చాల బాగుంది. ఇక పాటలు గురించి చెప్పాల్సిన పనిలేదు, తమన్ బెస్ట్ వర్క్స్ లో ఇది టాప్ ప్లేస్ లో ఉన్న చిత్రం. బ్యాక్ గ్రౌండ్ మ్యుజిగ్ పరంగా కూడా మెప్పించాడు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది, సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కథ పరంగా త్రివిక్రమ్ మరోసారి ఓల్డ్ పాయింట్ నే ఎంచుకున్నాడు. అయితే తన మార్క్ డైలాగ్స్ తో దాన్ని కొంచెం కవర్ చేయగలిగాడనే చెప్పాలి. ఎందుకో ఒకప్పుడు త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ ఇప్పుడు చేయలేకపోతున్నాడని అనిపిస్తుంది. నేరేషన్ పరంగా త్రివిక్రమ్ రొటీన్ అవుతున్నాడేమో అనిపిస్తుంది.

” ఎవరినైనా ఒక స్థానంలో కుర్చోపెట్టగలం కానీ వారికి స్థాయిని మనం తీసుకురాలేం. అది ఎవరికి వారు సంపాదించుకోవాలి.” ఇదే పాయింట్ ను తనకు అలవాటు అయిన రీతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే తర్వాత ఎం జరుగుందో ప్రేక్షకులకు ముందే తెలిసిపోతుంది. కూల్ గా సాగిపోయే కధనం, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ప్లస్ కాగా, పెద్దగా విలనిజం లేకపోవడం, రొటీన్ అనిపించే కొన్ని సీన్స్, కొంచెం బోర్ అనిపిస్తుంది. ఏది ఏమయినా కానీ “ఆలా వైకుంఠపురములో” ఈ సంక్రాంతి ఫ్యామిలీ అంతా కలిసి అలా వెళ్లి చూడదగ్గ చిత్రం.