స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీ నీడ నుంచి మెల్లిగా బయటపడి…
తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. డ్యాన్స్‌, ఫైట్స్‌ సహా… అద్భుత నటనతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇక పర్సనల్‌ లైఫ్‌లోనూ మంచి కొడుకుగా… మంచి భర్తగా… తండ్రిగా మంచి మార్కులే కొట్టేస్తున్నాడు.

అల్లు అర్జున్‌ భార్య స్నేహలతా రెడ్డి కూడా తక్కువేమీ కాదు. భర్తకు తగ్గ భార్యగా… మేడ్‌ ఫర్‌ బన్నీ అనిపించుకుంది. మరి అలాంటి స్నేహ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే అందరికీ తప్పకుండా ఉంటుంది.

వాస్తవానికి బన్నీ, స్నేహలది లవ్‌ కమ్‌ అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ అని చెప్పొచ్చు. 2011లో వీరిద్దరూ ప్రేమపక్షుల్లా విహరించి… పెద్దల ఆమోదంతో ఒక్కటయ్యారు. అయితే మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి.

పెళ్లికి అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా… స్నేహ తండ్రి… సిట్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఫౌండర్‌ కేసీ శేఖర్‌రెడ్డి అంగీకరించలేదు. దీంతో వారి వివాహానికి ఏడాది గ్యాప్‌ వచ్చింది. చివరికి మధ్యవర్తుల సహకారంతో ఇరు పక్షాలు పెళ్లికి అంగీకరించారు.

చిన్నప్పటి నుంచే స్నేహ ఎంతో చురుకైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీతో పాటు ఇంజినీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ని పూర్తి చేశారు.

ఇండియా వచ్చిన తర్వాత తమ సిట్‌ కాలేజ్‌ విస్తరణకు కృషి చేసింది. కాలేజ్‌ అకడమిక్స్‌ అండ్ ప్లేసెమెంట్ సెక్షన్‌ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసింది. తన డైనమిజంతో… కాలేజ్ ఈవెంట్స్ లో ఆక్టివ్ రోల్‌ ప్లే చేసింది. యువతను జాగృతం చేయడానికి స్పెక్ట్రం అనే కాలేజీలకు సంబంధించిన మ్యాగజైన్‌కి చీఫ్‌ ఎడిటర్‌గా కూడా పని చేసింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ 10వ తరగతి వరకు మాత్రమే చదివితే… స్నేహ రెడ్డి మాత్రం బన్నీ కన్నా ఏడాకులు ఎక్కువే చదువుకుంది.

కుటుంబపరంగా అత్తామామల వద్ద స్నేహారెడ్డికి మంచి ఇంప్రెషనే ఉంది. తమ కోడలు బంగారమని వారు చెబుతారు. అంతేకాదు అయాన్, అర్హలకి తల్లిగా స్నేహా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. ఆడుతూ పాడుతూ… జాలీగా… చిలిపిగా కనిపించే అల్లు అర్జున్‌కు ఇలాంటి భార్య దొరకడం నిజంగా ఆ కుటుంబం చేసుకున్న అదృష్టంగా చెబుతారు.

మరోవైపు స్నేహారెడ్డి సెల్ఫ్‌ రెస్‌పెక్ట్‌ను ఎక్కువగా కోరుకుంటుంది. తండ్రితో సంక్రమించిన ఆస్తులు, బిజినెస్‌ను, భర్తతో వచ్చిన స్టార్‌ స్టేటస్‌ను కాదనుకుని తనకంటూ ప్రత్యేకంగా ఉండాలని భావించింది. అందుకే జూబ్లీహిల్స్‌లో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించింది.

తన అభిరుచి మేరకు పికాబో అనే ఓ ఆన్‌లైన్‌ ఫోటో స్టూడియోని కొనుగోలు చేసింది….
బేబి ఫొటోగ్రఫి, మెటర్నిటి ఫొటోగ్రఫి చేస్తూ తన సత్తా చాటుతోంది.

ఇవండీ అల్లు అర్జున ప్రియ సతీమణి స్నేహ రెడ్డి గురించిన ఆసక్తికరమైన విషయాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here