దక్షిణాది కథానాయికల్లో అత్యంత పారితోషకం తీసుకునే వారిలో నయనతార ఒకరు. తెలుగులో బాలయ్య లాంటి వాళ్ళు పట్టుబట్టి మరీ అడిగినంత ఇప్పిస్తున్నారు గానీ చాలా వరకు తెలుగు సినిమాలలో ఆమె కనిపించకపోవడానికి కారణం కూడా ఆమె పారితోషకమే..

అయితే కొన్ని పాత్రలకే నయనతార బాగా న్యాయం చేస్తుందని, ఆమె తప్ప వేరే అప్షన్ లు లేకపోవడంతో ఆమె అడిగినంత ఇచ్ఛుకుంటున్నారు నిర్మాతలు. అయితే ఇటీవలే విడుదలైన సూపర్ స్టార్ రజని కాంత్ సినిమా “దర్బార్” లోను నయనతార నటించిన విషయం అందరికి తెలిసినదే.. అయితే ఈ చిత్రానికి గాను నయనతార పారితోషకం 5 కోట్లు. రజని కాంత్ సినిమా, పైగా మురుగుదాస్ దర్శకుడు అయినా కూడా ఏమాత్రం తగ్గలేదట ఈ అమ్మడు.

అలాగని రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్ర కూడా కాదు. పెద్దగా డైలాగులు కుడా లేవు, మాహా అయితే ఒక ఏడెనిమిది సీన్లలో కనిపించింది. రజనితో కలిసి ఒక పాటకి కూడా స్టెప్పులు వేసిందండోయ్.. అంతే ఆమాత్రానికే ఈ అమ్మడు కి 5 కోట్లు సమర్పించారట నిర్మాతలు. దీనిని బట్టి ఆమె క్రేజ్ ఏపాటిదో అర్ధం అవుతుంది. నయనతార మజాకా !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here